గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో డిసెంబ‌ర్ 1వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం

ముఖ్య సంఘటనలు..

1963: నాగాలాండ్ భారతదేశానికి 16 వ రాష్ట్రంగా అవతరించింది.
1965: భారతదేశంలో సరిహద్దు భద్రతా దళం ప్రారంభింపబడింది.
1965: తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురిస్తున్న ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి ప్రారంభం.
2006: 15వ ఆసియా క్రీడలు దోహా లో ప్రారంభమయ్యాయి.


ప్ర‌ముఖుల జననాలు

1699: రఫీయుల్ దర్జత్, భారతదేశపు 10వ మొఘల్ చక్రవర్తి (మ.1719).రఫీయుష్షాన్ చిన్నకుమారుడు, ఆజం - ఉష్- షా మేనల్లుడు, ఫర్రుక్‌సియార్ తరువాత 10వ మొఘల్ సింహాసం అధిష్టించాడు. రఫీయుల్ దర్జత్ 1719 ఫిబ్రవరి 28న సింహాసనం అధిష్టించాడు. సయ్యద్ సోదరులు రఫీయుల్ దర్జత్ ను మొఘల్ చక్రవర్తిగా ప్రకటించారు.
1878: జి.ఎస్.అరండేల్, దివ్యజ్ఞాన సమాజం మూడవ అధ్యక్షుడు, హోమ్‌రూల్ లీగ్ నిర్వాహణ కార్యదర్శి. (మ.1945)జార్జ్ సిడ్నీ అరండేల్ 1878, డిసెంబర్ 1వ తేదీన ఇంగ్లాండులోని సర్రే అనే ప్రాంతంలో జన్మించాడు[1]. ఇతని చిన్నతనంలోనే ఇతని తల్లి మరణించింది. ఇతని పినతల్లి మిస్ ఫ్రాన్సెస్కా అరండేల్ ఇతడిని పెంచి పెద్దచేసింది. ఫ్రాన్సెస్కా 1881లో థియొసాఫికల్ సొసైటీలో చేరింది. ఆ సమాజం స్థాపకులలో ఒకరైన హెలీనా బ్లావట్‌స్కీ తరచూ వారింటికి అతిథిగా వస్తుండడం వల్ల బాలుడైన అరండేల్‌కు ఆమెను కలుసుకునే అవకాశం దక్కింది. ఇతడు కొంతకాలం జర్మనీలోను, మరికొంత కాలం ఇంగ్లాండులోను విద్యను అభ్యసించాడు. 1900లో కేంబ్రిడ్జిలోని సెయింట్ జాన్స్ కాలేజీ నుండి ఎం.ఎ. పట్టాను పొందాడు.
1908: నార్ల వేంకటేశ్వరరావు, ప్రఖ్యాత పాత్రికేయుడు, కవి, సంపాదకుడు జననం (మ.1985).
1918: జెట్టి ఈశ్వరీబాయి, భారతీయ రిపబ్లికన్ పార్టీ నాయకురాలు, అంబేద్కరువాది, దళిత సంక్షేమకర్త. (మ.1991)
1954: మేధా పాట్కర్, నర్మదా బచావో ఉద్యమంతో పేరుగాంచిన సామాజిక ఉద్యమకారిణి.
1944: డి.ఎస్.ఎన్. మూర్తి, రంగస్థల నటుడు, దర్శకుడు, అభినయ అధ్యాపకుడు.
1980: ముహమ్మద్ కైఫ్, భారత క్రికెట్ క్రీడాకారుడు.

ప్ర‌ముఖుల మరణాలు

1995: మాగుంట సుబ్బరామిరెడ్డి, ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత మంచినీటి సరఫరా, ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. (జ.1947)
2002: అబు అబ్రహాం,ఒక భారతీయ వ్యంగ్య చిత్రకారుడు, పాత్రికేయుడు, రచయిత. (జ.1924)


పండుగలు , జాతీయ దినాలు

2003: ప్రపంచ ఎయిడ్స్ దినం.
నాగాలాండ్ దినోత్సవం.
సరిహద్దు భద్రతా దళ ఏర్పాటు దినోత్సవం.
మయన్మార్ జాతీయ దినం.

మరింత సమాచారం తెలుసుకోండి: