గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో జ‌న‌వ‌రి 25వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం


ముఖ్య సంఘటనలు

1905: ప్రపంచంలోని అతిపెద్దదైన 3106 క్యారెట్ల కల్లినన్ వజ్రందక్షిణ ఆఫ్రికా గనుల్లో కనుకొనబడింది
1918: రష్యన్ సామ్రాజ్యం నుండి "సోవియట్ యూనియన్" ఏర్పడింది.
1939: చిలీ దేశంలో వచ్చిన భూకంపంలో దాదాపు పదివేల మంది మరణించారు
1950: భారత గవర్నర్ జనరల్ పదవిని రద్దుచేసారు.
1971: హిమాచల్ ప్రదేశ్ 18వ రాష్ట్రంగా అవతరించింది.
1971: నరరూప రాక్షసుడుగా పేరొందిన ఉగాండా నియంత ఈడీ అమీన్‌ సైనిక కుట్ర ద్వారా అధికార పగ్గాలు చేజిక్కించుకున్నాడు.
1997: ఫాతిమాబీవి తమిళనాడు గవర్నరుగా నియామకం.
2010: ఇథియోపియాకు చెందిన విమానం మధ్యధరా సముద్రములో కూలిపోయి 90 మంది మృతిచెందారు.

ప్ర‌ముఖుల జననాలు

1874: సోమర్ సెట్ మామ్, బ్రిటిష్ నాటక రచయిత, నవలా రచయిత, లఘు కథా రచయిత.
1918: కొండవీటి వెంకటకవి, ప్రసిద్ధ కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత, వ్యాసకర్త. (మ.1991)
1925: కాకర్ల సుబ్బారావు, రేడియాలజిస్ట్, హైదరాబాదు నిమ్స్ ఆసుపత్రి పూర్వ డైరెక్టర్.
1925: పి. అచ్యుతరాం, హేతువాది, సంఘ సంస్కర్త. (మ.1998)
1952: సంపత్ కుమార్, ఆంధ్ర జాలరి, క్లాసికల్, ఫోక్ డాన్సర్. (మ.1999)
1968: నర్సింగ్ యాదవ్, తెలుగు సినీ నటుడు.
1980: క్జేవీ, బార్సెలోనా కొరకు ఆడే స్పానిష్ ఫుట్‌బాల్ మిడిల్ ఫీల్డర్ ఆటగాడు.
1981: అలీసియా కీస్, న్యూయార్క్‌కు చెందిన సంగీత విద్వాంసురాలు, నటీమణి.

ప్ర‌ముఖుల మరణాలు

1953: పింగళి వెంకట రామారెడ్డి, నిజాం పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి. (జ.1869)
1991: పి.ఆదినారాయణరావు, తెలుగు సినిమా సంగీత దర్శకులు, నిర్మాత. (జ.1914)
1994: సంధ్యావందనం శ్రీనివాసరావు, దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసుడు. (జ.1918)
2016: కల్పనా రంజని, మలయాళ సినిమా నటి (జ.1965)


పండుగలు , జాతీయ దినాలు

జాతీయ పర్యాటక దినోత్సవం
ఇంటర్నేషనల్ ఎక్సైజ్ దినోత్సవం
జాతీయ ఓటర్ల దినోత్సవం

మరింత సమాచారం తెలుసుకోండి: