గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో జ‌న‌వ‌రి 28వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం


ముఖ్య సంఘటనలు

1933: ముస్లిముల ప్రత్యేక దేశానికి పాకిస్తాన్ అనే పేరుపెట్టాలని ప్రతిపాదించారు. పాకిస్తాన్ అంటే స్వచ్ఛమైన భూమి అని అర్థం.
1950: భారత సుప్రీంకోర్టు పనిచేయడం ప్రారంభించింది.


ప్ర‌ముఖుల జననాలు


1865: లాలా లజపతిరాయ్, భారత జాతీయోద్యమ నాయకుడు, రచయిత. (మ.1928)
1885: గిడుగు వెంకట సీతాపతి, భాషా పరిశోధకుడు, విజ్ఞాన సర్వస్వ నిర్మాత. (మ.1965)జ‌న‌వ‌రి 28వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?
1929: రాజారామన్న, భారత అణు శాస్త్రవేత్త. (మ.2004)
1930: పండిట్ జస్రాజ్, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, మేవాతి ఘరానాకు చెందిన భారతీయ శాస్త్రీయ సంగీత గాయకుడు.జస్రాజ్ తొలి సంగీత గురువులు తండ్రి పండిట్ మోతీరామ్, అన్న పండిట్ మణిరామ్‌జీ లు. తరువాత జస్రాజ్ మహరాజా జయవంత్ సింగ్‌జీ వఘేలా వద్ద శిష్యరికం చేశాడు. జస్రాజ్ తన చిన్నప్పుడు ప్రఖ్యాత గజల్ గాయనిబేగం అక్తర్ శ్రావ్యమైన గొంతు విని ఎంతో ప్రభావితుడై, బడికి ఎగనామం పెట్టి ఒక చిన్న హోటల్‌లో వినిపించే ఆమె పాటలను రోజంతా వినేవాడు. 1960 లో, జస్రాజ్ ఒకసారి హాస్పిటల్‌లో ఉన్న బడే గులాం అలీఖాన్ను కలిసినప్పుడు, ఆయన జస్రాజ్‌ను తన శిష్యుడిగా ఉండమన్నాడు. కాని తను ఇదివరకే పండిట్ మోతీరామ్ శిష్యుడినని, జస్రాజ్‌ ఆయనను తిరస్కరించాడు. అన్న మణిరామ్‌జీ జస్రాజ్‌ను, తబలా సహకారం కోసం తన వెంట తీసికెళ్ళేవాడు. ఆ కాలంలో సారంగి వాద్యకారుల మాదిరే, తబలా వాద్యకారులను జనం చిన్నచూపు చూసేవారు. దాంతో జస్రాజ్ అసంతృప్తిపొంది, తబలాకు స్వస్తి చెప్పి, గాత్రం నేర్చుకొన్నాడు. జస్రాజ్ ఒక ప్రత్యేక వినూత్న పద్ధతిని జుగల్‌బందిలో ప్రవేశపెట్టాడు. అందులో పురాతన మూర్ఛనల పై అధారపడిన ఒక శైలిలో, గాయని, గాయకుడు తమ వేర్వేరు రాగాలను ఒకేసారి ఆలపిస్తారు. 
1955: వినోద్ ఖోస్లా, ఇండియన్-అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్.


ప్ర‌ముఖుల మరణాలు..

2014: బీరం మస్తాన్‌రావు, రంగస్థల కళాకారుడు, నట శిక్షకుడు, తెలుగు సినిమా దర్శకులు. (జ.1944)
2016: గౌరు తిరుపతిరెడ్డి, వాస్తునిపుణుడు (జ.1935)
2016: అరిందమ్ సేన్‌గుప్తా, ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ ఎడిటర్.

మరింత సమాచారం తెలుసుకోండి: