గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో మార్చి 2వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం


ముఖ్య సంఘటనలు..

1807: అమెరికా కాంగ్రెస్ బానిసలను దిగుమతి చేసుకోవడాన్ని చట్టపరంగా నిషేధించింది.
1836: టెక్సాస్ విప్లవం ద్వారా టెక్సాస్ రిపబ్లిక్ కు మెక్సికో దేశం నుండి స్వతంత్రం లభించింది.
1943: రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా బిస్మార్క్ సముద్రంలో యుద్ధం.
1956: మొరాకో దేశానికి ఫ్రాన్స్ నుండి స్వాతంత్ర్యం లభించింది.
2008: కౌలాలంపూర్లో జరిగిన అండర్-19 ప్రపంచకప్ క్రికెట్ లో భారత్ విజేతగా నిలిచింది.
2011: శివరాత్రి ; కోటిపల్లి తీర్థం.

ప్ర‌ముఖుల జననాలు..

1935: దుద్దిల్ల శ్రీపాద రావు, శాసనసభ్యుడు, శాసనసభ స్పీకరు. (మ.1999).ప్రజల మధ్య ఉంటూ వారి బాగోగులను పట్టించుకునే పరిస్థితుల్లోనే ఆయనను మృత్యువు నక్సల్స్ రూపంలో కబళించింది. 1999 ఏప్రిల్ 13 న మహాదేవపూర్ మండలం అన్నారంకు తన అనుచర వర్గంతో వెళ్లివస్తున్న క్రమంలో మార్గ మధ్యంలోని అడవుల్లో ఆయన వాహనాన్ని నక్సల్స్ ఆపివేసి, ఆయనతో మాట్లాడాలని చెప్పి లోపలి తీసుకెళ్ళి కరుకు తుపాకి తూటాలతో విగత జీవున్ని చేశారు. ఈ సంఘటన రాష్ట్రాన్ని కుదిపివేసింది. ఎన్నడు అపకారాన్ని తలపెట్టని నాయకుణ్ణి నిష్కారణంగా హతమార్చిన నక్సల్స్ పై విమర్శలు గుప్పు మన్నాయి.
1962: యాకూబ్, కవి, అంతర్జాలంలో బహుళ ప్రాచుర్యం పొందుతున్న తెలుగు కవిత్వ వేదిక కవిసంగమంను ప్రారంభించి నిర్వహిస్తున్నారు.
1977: ఆండ్రూ స్ట్రాస్‌, ఇంగ్లిష్‌ క్రికెటర్‌. ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టుకు నాయకుడు. ఎడమచేతి వాటం ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌.

ప్ర‌ముఖుల మరణాలు..

1938: వడ్డాది సుబ్బారాయుడు, తొలి తెలుగు నాటకకర్త. (జ.1854)
1949: సరోజిని నాయుడు, భారత కోకిల
1990: మసూమా బేగం, సంఘ సేవకురాలు, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకురాలు. (జ.1901)
2014: టి.వి.కె.శాస్త్రి, అనంతరం కళాసాగర్ సంస్థలో పనిచేస్తుండగా సంగీత విద్వాంసులు, కళాకారులు, రాజకీయ, సినీరంగ ప్రముఖులతో సంబంధాలు ఏర్పడ్డాయి.
2015: పరుచూరి హనుమంతరావు, ప్రగతి ప్రింటర్స్‌ స్థాపకుడు. ఆఫ్‌సెట్‌ ముద్రణాయంత్రం కంప్యూటర్‌ కంట్రోల్స్‌తో సహా దేశంలోనే తొలిసారిగా 1988లో ఇక్కడే ప్రవేశించింది. (జ. 1924)

మరింత సమాచారం తెలుసుకోండి: