గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో మే 17వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం

ప్ర‌ముఖుల జననాలు

1749: ఎడ్వర్డ్ జెన్నర్, భౌతిక శాస్త్రవేత్త. (మ1823)
1906: శ్రీరంగం నారాయణబాబు, తెలుగు కవి (మ.1961).నారాయణబాబు పద్య రచనలకు, భావ కవిత్వానికి భిన్నంగా కొంతమందితో కలసి సర్రియలిజం అనే విదేశీయ ప్రక్రియను అనుసరించి రచనలు చేశారు. ఒక యదార్థ రూపాన్ని కవితలోనో, చిత్రలేఖనంలోనో చూపించినపుడు, ఆ విషయం యొక్క మూల స్వరూపాన్ని వివిధ విపరీత పరిస్థితులలో వర్ణించి మరువలేని చిత్రంగా ప్రదర్శించడమే "సర్రియలిజం" అంటారు. దీనిని "అధివాస్తవికత " అని కొందరు అంటే "అతి వాస్తవికత" అంటే బాగుంటుందని వీరు భావించారు. విధానం విదేశీయమైనది అయినా మన దేశపు పౌరాణిక గాథలు, సమయోచితమైన అర్థాన్నిచ్చే ఆంధ్ర, సంస్కృత శబ్ద ప్రయోగం వీరి రచనలకు ప్రత్యేక లక్షణాలు.
1920: శాంతకుమారి, సినీ నటి (మ.2006).
1945: బి.ఎస్.చంద్రశేఖర్, భారత క్రికెటర్.
1986: ఛార్మి, సినీ నటి.

ప్ర‌ముఖుల మరణాలు..

1971: మల్లెల దావీదు, తెలుగు క్రైస్తవ కీర్తనాకారుడు (జ.1890).
1996: వెనిగళ్ళ సుబ్బారావు, పెళ్ళిమంత్రాల బండారం పుస్తకం రాసిన హేతువాది (జ.1939).సుబ్బారావు రేపల్లె నివాసి. అతను 1939 అక్టోబరు 2న జన్మించాడు. అతను చిత్రించిన అనేక చిత్రాలు నేటికీ రేపల్లె మునిసిపల్ హైస్కూలులో లభిస్తాయి. రేపల్లె సమీపంలోని పెనుమూడి గ్రామంలో ప్రకృతి ఆశ్రమం నెలకొల్పి అనేకమందికి ఆరోగ్యం ప్రసాదించాడు. హేతువాద ఉద్యమ నాయకులుగా కొన్ని వేల ఆదర్శ వివాహాలు చేయించాడు. చిత్రకారులుగా వెల్లటూరులోని నవరంగ్ చిత్రకళా నికేతన్‌లో అనేక మంది చిత్రకారులను తయారు చేశాడు. వెంకటేశ్వర సుప్రభాతంలో తెలుగు ఎందుకు ఉండదు? సంస్కృతంలోనే ఎందుకు అనే విషయాన్ని అతను తన రచనల ద్వారా వెలుగులోకి తెచ్చాడు
2007: టి.కె.దొరైస్వామి, భారతదేశ కవి, రచయిత. (జ.1921)
2013: కలేకూరు ప్రసాద్, సినీ గేయరచయిత, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు విశ్లేషకుడు ప్రజాకవి.(జ.1962)
2016: పశ్య రామిరెడ్డి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, స్వాతంత్య్ర సమరయోధుడు. (జ.1925)చిన్నతనం నుంచే వామపక్ష భావజాలానికి ఆకర్షితులైన రామిరెడ్డి, భారత కమ్యూనిస్టు పార్టీలో చేరి వివిధ ఉద్యమాల్లో చురుగ్గా పనిచేశాడు. నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం ప్రధాన పాత్ర పోషించడమేకాకుండా రైతాంగ పోరాట దళాలకు కొరియర్‌గా పనిచేశాడు. 60 ఏళ్ళుగా కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసిన రామిరెడ్డి, గత 30 ఏళ్లుగా హుజూర్‌నగర్‌ పట్టణ సీపీఐ పార్టీ కార్యదర్శిగా ఉన్నాడు.

పండుగలు, జాతీయ దినాలు

ప్రపంచ టెలి కమ్యూనికేషన్, సమాచార సొసైటీ దినోత్సవం.

మరింత సమాచారం తెలుసుకోండి: