మన దేశాన్ని బ్రిటిష్ వారు ఎన్నో సంవత్సరాలు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. ఆ సమయంలో ఎందరో భారతీయులని చిత్రహింసలు కూడా పెట్టారు. అయితే ఇంత క్రూరమైన బ్రిటిష్ వారిని ఒక చిన్న ఉద్యమం వెన్నులో వణుకు పుట్టించింది. ఆ ఉద్యమం పేరే చపాతీల ఉద్యమం. 1857లో సిపాయిల ఉద్యమం జరగకముందు మొదలయ్యింది ఈ చపాతీల ఉద్యమం. అసలు దీనిని ఎవరు మొదలుపెట్టారో ఎందుకు మొదలుపెట్టారో తెలీదు కానీ దేశమంతా ప్రతి చిన్న గ్రామాల్లోకి కూడా ఈ ఉద్యమం పాకింది.

ఎవరికి తెలియని ఒక వ్యక్తి ఉత్తరాది లో ఉన్న చిన్న గ్రామంలో ఉండే కాపాలదారుడికి చపాతీలు ఇచ్చి ఇవన్నీ ఊరంతా పంచమని చెప్పాడట. అలాగే ఇంకొన్ని కూడా చేసి ఇచ్చి వేరే ఊరిలో జనాలని పంచండి అని చెప్పారని , ఆ కాపులదారుడు కూడా ఊరంతా చపాతీలు పంచారు. అలా మొదలైన ఈ ఉద్యమం ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు ఉరురుకి పాకింది. ఇక ఈ ఉద్యమం గురించి 1857లో బ్రిటిష్ అధికారి ధోర్నాహిల్ చెవిలో పడింది. దీని గురించి ఆయన కొంచెం అరతీయ్యగా నమ్మలేని నిజాలు బయటపడ్డాయి.

 అవి ఏంటి అంటే ప్రతి రోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గ్రామాల్లోకి వచ్చి చపాతీలు పంచి వెళ్లిపోతున్నారు అని ఆ చపాతీలు రాత్రికి రాత్రి ఊరులు దాటేస్తున్నాయి అని తెలిసింది. అయితే ఇన్ని కనుకున్న ఆ బ్రిటిష్ అధికారి అసలు ఈ చపాతీలు పంచడం వెనుక ఉన్న అర్థంన్ని కనుక్కోలేకపోయాడు.ఇక ఈ విషయం తెలిసిన బ్రిటిష్ పాలకులకి ముచ్చచెమటలు పట్టాయి. వెంటనే ఈ చపాతీలలో ఏముందో అని వెతికి చూస్తే  అందులో ఏ సందేశం కనపడలేదు. విచిత్రంగా ఈ ఉద్యమం తర్వాతనే సిపాయిల తిరుగుబాటు , ఝాన్సీ లక్ష్మీ భాయ్ పోరాటాలు జరిగాయి. ఈ ఉద్యమాలకి చపాతీల ఉద్యమంకి  సంబంధం ఏంటి అనేది ఇప్పటికి ప్రశ్నార్ధకమే.

మరింత సమాచారం తెలుసుకోండి: