ఎదిగే పిల్లలకు ఈ వయసులోనే సరైన  పోషక ఆహారం ఇవ్వాలి. ఎదిగే వయసు పిల్లలకు పోషకాహారం లభించకపోతే ఆ ప్రభావం వారికీ జీవితాంతం ఉంటుంది. చిన్న వయస్సులో పిల్లలకు నేర్పించే ఆహారపు అలవాట్లు భవిష్యత్తులో వారి జీవనశైలిని సరైన మార్గంలో నడిపిస్తాయి అందువల్ల పిల్లలకు చిన్న వయస్సు నుండే సరైన ఆహారపుటలవాట్లను నేర్పించాలి. అదే వయసు గల పిల్లలతో పోలిస్తే తగినంత బరువు, ఎత్తు లేని పిల్లలు ఈ సమస్య బాధితులేనని చెప్పవచ్చు. సమస్యను ముందే గుర్తించి తగు చర్యలు తీసుకోకపోతే పిల్లలు తీవ్ర పోషకాహార లోపం బారిన పడే అవకాశం లేకపోలేదు. పిల్లలకు ఏలాంటి  ఆహారపదార్దాలు ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం…



పిల్లల లంచ్ బాక్స్‌లో కేలరీలు, ప్రొటీన్లతో కూడిన భోజనం ఉండాలి. లంచ్‌లో ఆకుకూరలను ఎక్కువగా చేర్చడం చాలా మంచిది. ఎందుకంటే లంచ్‌లో ఆకుకూరలు ఉండడం వల్ల అనేక విటమిన్లు, ఐరన్ పొందవచ్చు.అలాగే పిల్లల పెరుగుదలకు క్యాల్షియం చాలా అవసరం. అందుకే రోజులో మూడు సార్లు పిల్లలకు పాలు తగిన మోతాదులో ఇస్తుండాలి.రోజువారీ ఆహారంలో కూరగాయలు, పప్పు ధాన్యాలు, గుడ్డు, పండ్లు ఉండేలా చూడాలి. వీటికితోడు అదనంగా ఓ గుడ్డును కూడా అందించాలి పిల్లలకు ఆహార పదార్థాల పట్ల అవగాహన ఇంటి నుంచే మొదలవ్వాలి.



బయట కొనుగోలు చేసే చిప్స్, సోడా, జూస్ వంటి వాటిని నియంత్రించి ఇంట్లోనే స్వయంగా స్నాక్స్, పండ్ల రసాలు తయారుచేసి పిల్లలకు ఇవ్వాలి. రోజూ ఇంటినుంచే నాణ్యమైన భోజనాన్ని పంపించడం ద్వారా పిల్లలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. పిజ్జా, బర్గర్ వంటివాటికి దూరంగా ఉంచగలిగితే మేలు. అలాగే పిల్లలకు పంచదార అతిగా వాడకూడదు. దీంతో వారికి చిన్న వయస్సులోనే ఊబకాయం రాకుండా ఉంటుంది.ఒక వేళ పిల్లలు తీపి పదార్థాలు తినాలనుకుంటేే పంచదారకు బదులు బెల్లం పదార్థాలు పెడుతూ ఉండండి. ఆరోగ్యానికి చాలా మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: