చిన్న పిల్లలను వేధిస్తున్న సమస్యలలో ఆస్తమా ఒక్కటి. ఆ సమస్య ఉన్న వాళ్ళు చలికాలంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని కారణంగా జలుబు, దగ్గు మొదలైన సమస్యలు తలెత్తుతాయి. ఇక ఆస్తమాతో బాధపడే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు చలికాలంలో తీసుకుంటే మంచిదో ఒక్కసారి చూద్దామా.

ఆస్తమా సమస్యతో బాధపడుతున్న వారిని డాక్టర్ కి కన్సల్ట్ చేసి చేసే రెగ్యులర్ గా ఇన్హేలర్ ని వాడితే సమస్య తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ఇన్హేలర్ ని వాడడం వల్ల ఆస్తమా త్వరగా కంట్రోల్ అవుతుందని తెలిపారు. ఇక చాలా మందికి  స్మోకింగ్ చేసే అలవాటు ఉంటుంది. వాస్తవానికి స్మోకింగ్ వల్ల ఈ సమస్యతో బాధపడుతున్న పిల్లలు ఇబ్బంది పడాల్సి వస్తుందని అన్నారు. అంతేకాక..  స్మోకింగ్ చేసే వాళ్ళకి దూరంగా వున్నా పిల్లలు కూడా ఆస్తమా సమస్య మరింత ఎక్కువ అవుతుందని పేర్కొన్నారు.

ముఖ్యంగా గ్రామాలలో వంటను కట్టెల పొయ్యి మీద ఎక్కువగా వండుతుంటారు. అయితే కట్టెల పొయ్యి నుండి వచ్చే పొగ, అగరుబత్తుల పొగ మొదలైన వాటికి పిల్లలను దూరంగా ఉంచాలి. ఇక వీటి కారణంగా కూడా ఆస్తమా సమస్య మరింత ఎక్కువ అవుతుందని పేర్కొన్నారు. ఆస్తమాతో బాధ పడుతున్న పిల్లలను చలికాలంలో ఎక్కువగా బయట ఉంచకూడదు. ఎందుకంటే.. చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి సమయంలో పిల్లలు బయట ఆటలు ఆడినా ఆస్తమా ఎటాక్ చేస్తుందని అన్నారు.

అంతేకాదు.. చలిగాలి ఎక్కువగా తగలకుండా  పిల్లలకు చ్చగా వుండే దుస్తులు వేయాలి. ఇక పిల్లలకు రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలను ఇస్తూ ఉండాలి. అయితే ఇలా చేయడం వల్ల ఆస్తమా నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇక ఏ ఇబ్బందులు లేకుండా పిల్లలు ఆరోగ్యాంగా ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా.. చలికాలంలో దీని వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: