సాధారణంగా చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఎక్కువగా ఇబ్బంది పెట్టె విషయం బలుబు. ఇక జలుబు గొంతు దురదతో స్టార్ అవుతుంది. ఇక స్టార్టింగ్ స్టేజ్ లో ముక్కు నుంచి నీరు కారడం స్టార్ట్ అవుతుంది. చిన్న పిల్లలో జలుబు కావడంతో ముక్కు మూసుకుపోయి బిడ్డ శ్వాస పీల్చడం, పాలు తాగడానికి కష్టతరంగా ఉంటుంది. అంతేకాదు.. ముక్కు కారడం తగ్గాక 30 శాతం పిల్లల్లో దగ్గు వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అయితే పిల్లల్లో ఎలర్జీ వ్యాధిలో కనిపించినా.. తుమ్ములు, ముక్కు దురద మరీ ఎక్కువ. వ్యాధి లక్షణాలు రెండు వారాల తర్వాత కూడా వదిలిపెట్టకపోతే.. ఇతర సమస్యలేమైనా ఉన్నాయేమో పరీక్షించాలని అంటున్నారు. ఇక పిల్లలు ముక్కు దిబ్బడ తగ్గాక కూడా చెవి లాక్కుంటూ ఉంటారు. ఆ సమయంలో పిల్లలు చెవిని ముట్టుకుంటే ఏడుస్తుంటారు. ఇక అలాంటప్పుడే చెవిలో చీము చేరే అవకాశం ఉందని సమాచారం. స్కూల్ కి వెళ్లే  పిల్లలైతే సైనసైటిస్ ఉందేమో పరీక్షించాలని చెబుతున్నారు.

సాధారణంగా జలుబు వైరస్ వల్ల వస్తుంది కాబట్టి, ప్రత్యేకమైన మందులేవీ ఉండవు. ఈ వ్యాధి లక్షణాల తీవ్రత తగ్గించడానికి మాత్రం మందులు అవసరం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ముక్కు మూసుకుపోయి శ్వాస పీల్చడం కష్టంగా ఉన్నప్పుడు, వత్తిలా చేసిన దూదితో రోజుకు నాలుగుసార్లు ముక్కును శుభ్రం చేయాలని చెబుతున్నారు. పిల్లలు శ్వాస తీసుకోవడం కష్టమైతే ముక్కులో 'స్లైన్' చుక్కలు వేయాలని సూచిస్తున్నారు.

అంతేకాదు.. పని చేయనప్పుడు వైద్యుల సలహాపై జైలో మెటాజోలిన్, ఆక్సీ మెటాజోలిన్ చుక్కలు వాడుతుండాలని చెబుతున్నారు. ఇక  మందు ఎక్కువ రోజులు వాడి ఒక్కసారిగా ఆపేస్తే, వ్యాధి లక్షణాలు తీవ్రస్థాయిలో తిరగబెడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే జ్వరం వస్తే పారసిటమల్ సరైన మోతాదులో వాడాలని అంటున్నారు. అయితే సాధ్యమైనంత వరకు బడి వయసు వచ్చేవరకు పిల్లలను ఇంటి దగ్గరే ఉంచుకుని సంరక్షించాలని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: