మనకు ఎన్ని ఆస్తి పాస్తులు ఉన్నా, ఆర్ధికంగా ఎంత బలంగా ఉన్న... మన పిల్లలు ఆరోగ్యంగా లేకపోతే మనము పడిన కష్టమంతా వృధానే అవుతుంది. అందుకే పిల్లలు గురించి తల్లితండ్రులు ఎపుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు. తమ పిల్లలకు సంబందించిన ప్రతి విషయం లోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వారి ఆరోగ్యం పెరుగుదల విషయంలో ప్రత్యేక శ్రద్ద చూపుతుంటారు. అయితే చాలా మంది పిల్లలు వయసుకు తగ్గ శరీర దారుఢ్యం మరియు వారు పొడవుగా లేరని బాధపడుతుంటారు. తమ పిల్లల్లో పెరుగుదల పెరగడానికి ముఖ్యంగా వారి హైట్ పెద్దగా పెరగడం లేదే అని, తోటి పిల్లల కంటే తమ బిడ్డ తక్కువ హైట్ లో ఉన్నారని చింతిస్తుంటారు.

అయితే కొందరు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా మరి కొందరు తల్లితండ్రులు మాత్రం చాలా సీరియస్ గా తీసుకుని హాస్పిటల్స్ అని, రకరకాల మందులు ఆయుర్వేదాలు వంటివి ప్రయత్నిస్తుంటారు.  అయితే పిల్లల్లో ఎదుగుదల సరిగా ఉండటానికి ఏమి చేయాలి అని అడుగగా... నిపుణులు ఎక్కువగా చెబుతున్న సమాధానం ఏమిటి అంటే..!! వారి రోజువారీ ఆహారం లో విటమిన్ డి, మెగ్నీషియం, క్యాల్షియం , ఫాస్పరస్, ఐరన్ వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని మాత్రమే మీ పిల్లలకు  ఇవ్వాలి అని చిన్నపిల్లల నిపుణులు సలహా ఇస్తున్నారు.

అలాగే పిల్లల శరీర ఎదుగుదలకు, మానసిక వికాసానికి ఆటలనేవి చాలా ముఖ్యమని చెబుతున్నారు. పిల్లలకు ఆడుకోవడం అనేది ఒక ఎక్సర్సైజ్ లాంటిది. శరీర పెరుగుదలకు ఆహారం లోని పోషకాలతో పాటు వ్యాయామం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అందుకే తల్లితండ్రులు అందరూ కూడా మీ పిల్లలను ఆడుకునేలా చెయ్యాలి. కొందరికి ఇంటి దగ్గర ఆదుకునే అంత స్థలం లేకపోయినా, దగ్గర్లోనే పార్క్ కు కానీ లేదా మీ బంధువుల ఇళ్లకు కానీ తీసుకెళ్లి ఆడించాలి. ఇలా చేయడం వలన వాళ్ళు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండడంతో పాటు, వయసుకు తగిన విధంగా పొడవు మరియు బరువులో కూడా ముందుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: