చాలా మంది తల్లులు ప‌ని పిల్ల‌ల‌ను బ‌య‌ట‌కు వెళ్ళే ట‌ప్పుడు తీసుకుని వెళ్ళ‌రు. ఒక‌వేళ త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో వెళ్ళాల్సి వ‌చ్చిన‌ప్పుడు మాత్రం. వాళ్ల‌ను ఎక్కువ సేపు ఎత్తుకోలేక ఈ మ‌ధ్య ర‌క ర‌కాల కొత్త కొత్త బుట్ట‌లు, న‌డుంకి క‌ట్టుకునేవి అలాగే ఉయ్యాల లాంటి స్టాండ్‌లు వ‌చ్చేశాయి. కాని అవ‌న్నీ కూడా మ‌న వెంట తీసుకువెళ్ళ‌డం చాలా క‌ష్టంగా ఉంటుంది. ముఖ్యంగా న‌డుముకి క‌ట్టుకుని బెల్టు గురించి తెలుసుకుందాం. ఇది వీపుకి క‌ట్టుకుని పిల్లాడిని ఎత్తుకోకుండా అందులో ప‌డేస్తారు త‌ల్లిదండ్రులు అందులో ప‌డేసి వారి ప‌ని వారు చేసుకుంటూ ఉంటారు. షాపింగ్ అని, తిన‌డ‌మ‌ని ఇలా ర‌క ర‌కాల ప‌నులు చేస్తుంటారు. కానీ... ఇప్పుడు కొత్త‌గా ఒక బెడ్ లాంటిది వ‌చ్చింది. అలాగే దాన్ని క్యారీ చెయ్య‌డం కూడా చాలా ఈజీ అంతేకాక బ‌య‌ట‌కు వెళ్లినప్పుడు బేబికి కావ‌ల‌సిన ప్ర‌తి వ‌స్తువును అందులో పెట్టుకోవ‌చ్చు. 

 

పసిపిల్లలతో ఆసుపత్రికో, రెస్టారెంట్ కో, షాపింగ్ కో... వెళ్లినప్పుడు వాళ్లని ఎత్తుకునే ఉండాలి అంటే నేటి త‌రం వ‌ల్ల కావ‌డం లేదు. పిల్లల్ని అలా ఎక్కువ సేపు చేతుల్లో ఉంచుకోవడం పెద్దవాళ్లకి ఇబ్బందిగా ఉంటుంది. పసివాళ్లకి కూడా అసౌకర్యంగా అనిపిస్తుంది. దాంతో కొన్నిసార్లు చిరాకు చేసి ఏడుస్తుంటారు. అలాగని వాళ్లని ఎక్కడపడితే అక్కడ పడుకోబెట్టలేం. అలానే వాళ్లని బయటకు తీసుకెళ్లినప్పుడు బట్టలూ, డైపర్లూ, న్యాప్ కిన్లూ, టవల్స్, పాలడబ్బాల వంటివెన్నో సర్దుకోవాలి. వాటన్నిటినీ ఒక్కో విడి కవరులో ఉంచి బ్యాగులో పెట్టుకోవాలి. లేదంటే అన్నీ కలిసిపోయి తీసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అయితే ఈ సమస్యలకి పరిష్కారంగా వచ్చినవే బేబీ స్లీపింగ్స్ బ్యాగులు. పలు అరలున్న ఈ బ్యాగుల్లో పిల్లల బట్టలూ, డైపర్లూ, న్యాప్ కిన్లు వేటికవే పెట్టుకోవచ్చు.  అంతేకాక దాన్ని పూర్తిగా ఓపెన్ చేస్తే పిల్లలకు బెడ్డులానూ మారిపోతుంది. బ్యాగులో ఎన్ని పెట్టినా లోపలున్న కుషన్ వల్ల పిల్లలకి మెత్తగానూ ఎంతో సౌకర్యంగానూ ఉంటుంది. ఇక దీంతో వారు ఇబ్బందిప‌డ‌రు మ‌న‌ల్ని ఇబ్బంది పెట్ట‌రు. 

మరింత సమాచారం తెలుసుకోండి: