ఆధునిక యుగంలో పిల్ల‌ల పెంప‌కం అనేది అతిపెద్ద స‌వాలు. మీ పిల్ల‌ల‌ను మంచి పౌరులుగా తీర్చిదిద్దాల‌నుకుంటే ముందు మీరు మంచి పౌరులుగా త‌యారు కావాలి. ఎందుకంటే ఈ ప్ర‌పంచంలో పిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రుల‌ను మించిన రోల్ మోడ‌ల్స్ ఎవ‌రూ ఉండ‌రు. చాలా మంది త‌ల్లిదండ్రులు తాము త‌మ పిల్ల‌ల‌కు మంచి పెంప‌కం అందిస్తున్నామ‌ని భ్ర‌మ‌ల్లో బ‌తుకుతూ పిల్ల‌ల జీవితాల‌తో పాటు త‌మ స్వంత జీవితాల‌ను కూడా ఇబ్బందుల్లో ప‌డేసుకుంటున్నారు.

 

ఎందుకంటే వ‌ర్త‌మానంలో మ‌నం తీసుకున్న నిర్ణ‌యాలు, చేస్తున్న ప‌నులే మన భ‌విష్య‌త్ ను నిర్ణ‌యిస్తాయి. క్ర‌మ‌శిక్ష‌ణ పేరుతో పిల్ల‌ల్ని హాస్ట‌ల్ లో చేర్పిస్తున్న త‌ల్లిదండ్రులు త‌మ జీవిత చ‌ర‌మాంకంలో క‌చ్చితంగా వృద్ధాశ్ర‌మాల‌కు చేరుకోవాల్సి ఉంటుంద‌న్న క‌ఠిన స‌త్యాన్ని గుర్తించాలి. ప్ర‌స్తుత స‌మాజంలో జ‌రుగుతున్న విష‌యాలు,  ప్ర‌తీ విష‌యానికి పిల్ల‌ల‌ను ప్ర‌శ్నించ‌డం, లేదా వాళ్ల‌కు సూచ‌న‌లు చేయ‌డం..ప్ర‌తీ ఇంట్లోనూ ఇదే తంతు జ‌రుగుతుంది కానీ పిల్ల‌ల‌తో కాస్త స‌మ‌యం మ‌న‌స్సు విప్పి మాట్లాడేందుకు ఏ తల్లిదండ్రులు సుముఖంగా లేరు. 

 

ఈ రోజుల్లో చాలా మంది త‌ల్లిదండ్రులు ఎంత‌సేపు ఆదేశాలు జారీ చేస్తూ, ఆర్డ‌ర్లు వేస్తూ పిల్ల‌ల‌ను చేజేతులా దూరం చేసుకుంటున్నారు. ఎంతసేపు క్ర‌మ‌శిక్ష‌ణ‌, చ‌దువు, కెరీర్ అంటూ వాళ్ల‌ను ఒక బోనులో బందించేస్తున్నారు. చ‌దువు, కెరీర్ కావాల్సిందే కానీ దాన్ని చెప్పేందుకు పిల్ల‌ల ద‌గ్గ‌ర విల‌న్ లా మారిపోవాల్సిన అవ‌స‌రం లేదు. చిన్న‌త‌నం నుంచి హాస్ట‌ల్ లో పెరిగిన పిల్ల‌వాడికి అనుబంధాలు, ఆప్యాయ‌త‌లు ఏం తెలుస్తాయి?  బాగా సెటిల్ అయి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న చాలా మంది ఇక్క‌డ త‌మ త‌ల్లిదండ్రుల‌ను వృద్ధాశ్ర‌మాల్లోనే జాయిన్ చేస్తున్నారు. ఎక్క‌డ త‌ప్పు జ‌రుగుతోంది? పిల్ల‌ల ఆలోచ‌నా విధానంలోనా? త‌ల్లిదండ్రుల పెంప‌కంలోనా? క‌చ్చితంగా త‌ల్లిదండ్రుల పెంప‌కంలోనే జ‌రుగుతోంది.

 

సాధార‌ణంగా ప్ర‌తీ త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌కు LSRW నేర్పిస్తారు. అంటే కేవ‌లం లెర్నింగ్, స్టడీ, రీడింగ్, రైటింగ్ మాత్రం చెపుతారు. ఇది పిల్ల‌ల మానసిక వికాసానికి అంత‌గా ఉప‌యోగ‌ప‌డ‌దు. మూస ప‌ద్ధ‌తిలో బ‌ల‌వంతంగా నేర్చుకునే విషయానికి ఎప్ప‌టికీ విలువ ఉండ‌దు. ప‌ల‌క‌పై అక్ష‌రాలు దిద్దుస్తున్నారు కానీ అస‌లు ప‌ల‌క అంటే ఏమిటో చెప్ప‌లేక‌పోతున్నారు. ప‌ల‌క‌ను ఇంగ్లీష్ లో స్లేట్ అంటారు అని తెలుసుక‌దా?

 

అక్ష‌రాల‌ను నేర్చుకోవ‌డానికి పునాది వేసిన ప‌ల‌కలోని అస‌లైన వివ‌ర‌ణ‌ను తెలుసుకున్న‌ప్పుడు అస‌లైన విద్య‌ను నేర్చుకున్న‌ట్టు. SLATE అంటే సోష‌ల్, లీడ‌ర్ షిప్, అవేర్ నెస్, టెక్నిక‌ల్, ఎడ్యుకేష‌న్. స‌మాజం ప‌ట్ల అవ‌గాహ‌న‌తో ఒక విష‌యాన్ని సాంకేతిక దృక్కోణంతో చూసి నాయ‌కత్వంతో ముందుకు తీసుకెళ్లే విధంగా నేర్చుకునే చ‌దువు ఉండాలి.. అప్పుడే పిల్లలు మంచి పధంలో ముందుకు దూసుకుపోతారు. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: