పేరంట్స్‌ మీటింగ్‌లకు పేరెంట్స్‌ వెళ్లటం లేదు. ఇది సామాజిక బాధ్యతగా భావించి మీటింగ్‌లకు వెళ్లాలి. తల్లి కూడా పిల్లల విషయంలో తగు బాధ్యత వహించాలి. తల్లిదండ్రులు తమ బిడ్డల మీద పూర్తి నిఘా ఉంచాలి. తమ పిల్లలకు వేలు, లక్షల రూపాయలు ఫీజులుగా చెల్లించడంలోనే బాధ్యత సరిపోదు. వారి ప్రవర్తన, నిత్యం గమనిస్తూ ఉండాలి. వారి స్నేహితులు, సెల్‌ఫోన్‌, ఇంటర్నెట్‌ వంటివన్నింటిని పరిశీలిస్తుండాలి. మీ పిల్లలకు లెక్కలేనన్ని నియమాలు, నిబంధనలు పెట్టకండి. వారు మీతో మనసు విప్పి మాట్లాడేలా మీ పిల్లలకు వారి మనసుకు దగ్గరగా ఉండండి. మీ పిల్లలకు మీరిచ్చిన మాటలను నిలబెట్టుకునేలా ఉండండి. మిమ్మల్ని చూసే మీ బిడ్డలు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకునే లక్షణాన్ని కలిగి ఉంటారు.

 

 

బాల్యదశలో మొదటిది ఇల్లు. ఒక చక్కటి క్రమశిక్షణ గలిగిన జీవనమందిరం. రెండవ ఇల్లు స్కూలు గనుక స్కూల్లో టీచర్స్‌ బాధ్యతగా ఉండాలి. పిల్లలు సంతోషాలు, ఆనందాలు, ఆప్యాయతలు, వారి ఆవేదనలు, మనోవేదనలు పంచుకునే సమయం తల్లిదండ్రులకు ఉండాలి. సామాజిక అవసరాల నేపథ్యంలో తల్లిదండ్రుల దగ్గర ఆడుతూ, పాడుతూ పెరగాల్సిన పిల్లలు చిల్డ్రన్‌ కేర్‌ సెంటర్లలో పెరగటం చేత ప్రేమకు దూరమై వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నారు. స్కూల్లో ప్రవేశించింది మొదలుకొని ర్యాంక్‌ సంపాదించుకుని పేరు తెచ్చుకోవాలి. డబ్బు సంపాదించాలి. అదేవిధంగా తల్లిదండ్రులు ఆలోచిస్తారు. బాల్యం నుండి స్నేహపూరితమైన, ఆరోగ్యకరమైన కుటుంబ వాతావరణాన్ని పిల్లలకు అందించాలి.

 

 

తల్లిదండ్రులు, పిల్లల మధ్య స్నేహభావంతో కూడిన అనుబంధాలు పెరగాలి. అప్పుడే ఉన్నతమైన విలువలను, మనం కోరుకునే మంచి మార్పు సాధ్యమవ్ఞతుంది. సమాజంలో ఎలా నడచుకోవాలో నేర్పాలి. మానవధర్మాన్ని సహనాన్ని, దయ, ఔదార్యంతో పాటు ఆత్మవిశ్వాసానికి, నైతిక విలువలకు పునాది వేయాలి. పిల్లల్లో సామాజిక అవగాహన కల్పించాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు క్రమశిక్షణతో పాటు నైతిక, ఆధ్యాత్మిక, సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేయాలి.పిల్లల్లో స్నేహ పూర్వకమైన ధోరణి మీ వలనే పెంపొందించబడుతుంది. ఎందుకంటే వారికి ఫస్ట్‌ అండ్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ మీరే. కనుక పిల్లలతో తల్లితండ్రులు ఫ్రెండ్స్‌లా ప్రవర్తించాలి. మీ పిల్లల ప్రవర్తనపై వారి స్నేహితుల ప్రభావం చాలా ఉంటుంది. కనుక వారికి మంచి స్నేహితుల సాహచర్యాన్ని మీరు పెంపొందగల్గితే మరీ ఉత్తమం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: