ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగింది. వినోదం, ఆటలు, ఆన్ లైన్ షాపింగ్, బ్యాంకింగ్ సేవల వంటి ఎన్నో సేవలను స్మార్ట్ ఫోన్ అరచేతిలోకి తీసుకొచ్చింది. దీంతో ఇదో తప్పనిసరి అవసరంగా మారిపోయింది. పిల్లలకు కూడా ఫోన్ లో గేమ్ ఆడడం అలవాటుగా మారిపోయింది.తల్లిదండ్రులు పనిలో పడి పిల్లలకు ఫోన్ అలవాటు చేస్తున్నారు. అలాగే అల్లరి చేస్తున్నారని ఫోన్ ఇస్తున్నారు. కానీ  మొదట్లో సరదాగా మొదలయ్యే అలవాటు కొంతకాలం అయ్యేసరికి వ్యసనంగా మారుతున్నాయని వారు హెచ్చరిస్తున్నారు.నేటి యువత రోజులో 20 శాతం సమయం స్మార్ట్ ఫోన్ తోనే గడుపుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు.

 

అయితే అదేపనిగా వీడియో గేమ్స్ ఆడే పిల్లలకు పలు రకాల శారీరక, మానసిక సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేమిటో వాటిని ఎలా నివారించాలి ఇప్పుడు తెలుసుకుందాం..ఏదైనా పని వద్దంటే అసహనానికి గురికావటం, మొండిగా అదే చేయటం, పెద్దవాళ్ళ మీద తిరగబడటం, ఎప్పుడూ గదిలోపల గడియ పెట్టుకొని ఉండటం, భోజనం కూడా తమ గదిలోనే తింటా అనడం, ఆటల్లో ఓడిపోతే ఏడవటం, కోపగించుకోవటం, వస్తువులు విసిరికొట్టటం, స్నేహితులు, తల్లిదండ్రులతో అత్యంత అవసరమైతే తప్ప మాట్లాడకపోవటం, కళ్ళు, మెడ, మణికట్టు కండరాల నొప్పి, పరీక్షలు, హోం వర్క్ వంటి వాటి మీద శ్రద్ధ, ఏకాగ్రత చూపలేకపోవటం, చెప్పేది విన్నట్టు కనిపించినా తిరిగి అడిగితే జవాబు చెప్పలేకపోవటం, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉన్నట్లు కనిపించటం, ఇంటికి ఎవరైనా వచ్చినా పట్టించుకోకుండా గేమ్ ఆడుతూ ఉండటం వంటి లక్షణాలు పిల్లల్లో కనబడతాయి.

 

వీటిని తగ్గించడానికి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలా చేయకుంటే అనారోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు ఫోన్ అలవాటు చేస్తూ పోతే.. అతిగా బరువు పెరిగిపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారు హెచ్చరిస్తున్నారు.అధిక బరువు ఉన్నవారిలో ఎక్కువగా అకాల మరణాల నుంచి గుండెజబ్బులు, డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొన్నిరకాల క్యాన్సర్లు పుట్టుకుచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మీ పిల్లలను సమయానికి కంటి నిండా నిద్రపోయేలా వాతావారణాన్ని కల్పించాలి.ఫోన్ ఎక్కువ సేపు చుసిన కళ్ళు కూడా దెబ్బతింటాయి. జీవితాంతం అదే అలవాట్లను అలవరుచుకునేలా చూడాలి. తద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే స్థూలకాయం, ఇతర వ్యాధుల నుంచి బయటపడవచ్చు.

 

ఏడాది నుంచి నాలుగేళ్ల వయస్సు ఉన్న పిల్లలకు రోజులో కనీసం మూడు గంటల పాటు వివిధ ఫిజికల్ యాక్టివిటీస్ చేయించాలని సూచించారు. పిల్లలకు ఫోన్, టీవీ వంటి స్క్రీన్ లను దూరంగా పెట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది.

 

ఏడాది కంటే తక్కువ వయస్సు కలిగిన శిశువులను ఎలక్ట్రానిక్ స్ర్కీన్లకు ఎట్టి పరిస్థితుల్లో దగ్గరగా ఉంచకూడదు. వీటివల్ల రేడియేషన్ ప్రభావం శిశువులపై తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తోంది. ఐదేళ్ల లోపు పిల్లలను ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండేలా వారితో ఆటలు ఆడించాలని వైద్యులు సూచిస్తున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: