పిల్లల చదువు విషయం మాట్లాడేటప్పుడు చాలా మంది పేరెంట్స్ చెప్పే ఒకే ఒక కారణం పిల్లలు సరిగా చదవడం లేదని..  పేరెంట్స్ టీచర్ మీటింగ్ కి వెళ్లినప్పుడు కూడా టీచర్ చెప్పేది ఇదే కంప్లైంట్. పిల్లలు మాథ్స్ అంటే చాలు అసలు ఇంట్రెస్ట్ చూపరు. దానికి కారణాలు ఏంటి చూద్దాం... పిల్లలందరి లోనూ తెలివితేటలు ఒకేవిధంగా ఉండవు. ఇక్కడ తెలివి తేటలు అంటే ఏ విషయాన్ని ఐనా మన మెదడు రిసీవ్ చేసుకొనే దాన్ని బట్టి ఉంటుంది. ఇది కొంత మందిలో ఎక్కువగా మరికొంతమందిలో తక్కువగా ఉంటుంది. ఐతే మ్యాథ్స్ సబ్జెక్టు అంతా లాజికల్ థింకింగ్ తో ఉంటుంది.

 

ఉదాహరణకు 2 + 3 = 5 అని చెప్తే ఇది పిల్లల కంటికి ఏమి కనిపించదు. కేవలం వారు మనస్సు లో 2, 3 కలపడం లాంటి బావనాలు మైండ్ కి చేరి అప్పుడు ఆన్సర్ చెప్పగలుగుతారు. కానీ అదే మొక్కలు రోజూ ఎదుగుతాయి ఇవి ఒకచోట నుండి మరియొక చొటకి కదలవు అని చెప్తే అది వెంటనే వాళ్ళ మైండ్ రిసీవ్ చేసుకుంటాది. ఎందుకంటే కంటికి కనిపించే దృశ్యం. ఇదే మ్యాథ్స్ కి వేరే సబ్జెక్టు కి ఉన్న తేడా. ఏ క్లాస్ కి సంబంధించిన బేసిక్ విషయాలు ఆ క్లాస్ లో పెర్ఫేక్ట్ గా రాక పోతే తరువాత క్లాస్ లో దానికి సంబంధించిన భాగాలు అర్ధం కాక వాటిమీద ఇంట్రెస్ట్ తగ్గి మార్కులు తగ్గిపోతాయి. ఇది అతి పెద్ద రీజన్. ఇలా ఎందుకుఅర్ధం కావట్లేదు దానికిచాలా కారణాలు ఉన్నాయి. 

 


టీచర్ చెప్పే విధానం, మైండ్ రిసీవ్ చేసుకొనే పవర్ లాంటివి. ఇప్పుడు చాలా స్కూల్ లో ఆక్టివిటీ బేస్ లెర్నింగ్ ఉంది. ఇదికొంత వరుకు బాగానే ఉంటుంది కానీ ఏ ఆక్టివిటీ అయినా క్లాస్ లో అధికంగా పిల్లలు ఉంటే, అందరికీ దానిని చేసి రిసీవ్ చేసుకొనే అవకాశం మాత్రం ఉండదు.. పిల్లలు చిన్న వయస్సు లో తిరిగి అడగడానికి భయపడతారు. అర్ధం కానీ విషయాలు వారి మనస్సులో అలాగే ఉండిపోతాయి. ఐతే కొంతమంది పిల్లలు మ్యాథ్స్ చాలా బాగా చేస్తారు. కానీ థియరీ సబ్జెక్టు లు అంతగా చదవరు. దీనికి కారణం వీరికి అధికంగా లాజికల్ థింకింగ్ ఉండడమే. ఇట్లాంటి వాళ్ళు ఎవరి సహాయం లేక పోయిన గాని చేయగలుగుతారు.  మ్యాథ్స్ లో తక్కువ మార్కులు వస్తే నీకు మ్యాథ్స్ రాదు అంటూ నిరుత్సాహ పరచకుండా దానికి కారణాలు కనుక్కోవాలి. పేరెంట్స్ కొంచెం ఓపిక కావాలి. 


ఏ క్లాస్ ఐనా సరే వాళ్ళ టెక్స్ట్ బుక్ తీసుకొని చాప్టర్ లో ఉన్న సబ్ టాపిక్స్ లో కొన్ని చిన్న లెక్కలు  ఇచ్చి చేయమనాలి. ఒకవేళ చేయలేకపోతే, అవి ఒకచోట కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. అదే డేటా వాళ్ళ టీచర్ కి కూడా ఇచ్చి ఆ చాప్టర్ లో ముఖ్యమైన బేసిక్ మరొక సారి చెప్పమని అడగండి. దీని వలన ఒకవేల పిల్లలు టీచర్ ని అడగక పోయిన వారి ఏమి అర్ధం కాలేదో టీచర్ల కు తెలుస్తుంది. అలాగే ఇంట్లో కూడా తల్లితండ్రులు శ్రద్దగా పిల్లల్ని పట్టించుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: