ఆధునిక యుగంలో పిల్లలకు మంచి విషయాలు తెలియజేయాలంటే తల్లిదండ్రులు పడే భాదలు చెప్పుకోరానివి. ఎందుకంటే ఇప్పుడు అంతా  ఫోన్‌, వీడియో గేమ్స్‌ అంతే. అలా కాసేపు బయటికి వెళ్లాలనే ఆలోచనే ఉండదు. పూర్వపు రోజుల్లో బడి వయస్సు పిల్లలు అందరు ఒక దగ్గర చేరి రకరకాల ఆటలు ఆడేవారు. వారికి సాంఘిక వికాసం బాగా జరిగి కొత్త పరిస్థితులకు వెంటనే సర్దుకునేవారు. కాని ఇప్పుడు నలుగురితో మాట్లాడటమే కష్టం.అసలు పక్క వారితో సంబంధం లేకుండా జీవిస్తున్నారు. అలాంటి వారు బడిలో కూడా చురుకుగా ఉండరు. ఎన్నో డిగ్రీలు సంపాదించిన మంచి కంపెనీలో ఉద్యోగం పొందలేకపోతున్నారు.

 

వారి తల్లిదండ్రుకు పిల్లలని బాగా తెలివిగా చేయాలన్న  కోరిక కోరికగానే మిగులుతుంది. పిల్లలు కొత్త పరిస్థితులకు త్వరగా సర్దుబాటు చెందితే వారే తెలివైన పిల్లలుగా రూపొందుతారు.అది ఎలాగో చూద్దామా.. !!చిన్నప్పటి నుండే పిల్లల తెలివిని పెంచడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేమిటంటే...
 నెలల వయస్సున్నప్పటి నుండే పిల్లలను బయటికి తీసుకువెళ్లాలి. చెట్లు, పచ్చదనం ఉన్న ప్రదేశాల్లో పిల్లలను చాలాసేపు ఆడనివ్వాలి.
 బొమ్మలు తెచ్చి ఇవ్వడం వరకే తల్లిదండ్రుల విధి ఆ తర్వాత వారే ఆడుకోవాలి, ఈ బోమ్మతో ఇలా ఆడు, ఆ బొమ్మతో ఇలా ఆడు అనే ఆంక్షలు  పెట్టరాదు.పిల్లలను స్వేచ్ఛగా బయటకు వదలాలి. వారి ఇష్టం వచ్చిన వారితో ఆడుకోనివ్వాలి, మేము పక్కింటి వారితో మాట్లాడట్లే నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అని ప్రశ్నించకూడదు.

 


పిల్లలకు రెండు సంవత్సరాల వరకు ప్రశ్నించే వయస్సు కాబట్టి వారు అడిగిన ప్రశ్నలకు ఓపికగా తల్లిదండ్రులు సమాధానం చెప్పాలి అంతేకాని ఏం అడగవద్దు, విసిగించవద్దు అని తిట్టకూడదు.
 ఆట వస్తువులను పాడు చేసిన, పగలకొట్టినా తిట్టకూడదు. అలా చేయకూడదని నిదానంగా చెప్పాలి. ఈ విధంగా పిల్లలతో తల్లిదండ్రులు చాలా ఓపికగా వ్యవహరిస్తూ వారి తెలివిని రెట్టింపు చేయవచ్చు. పిల్లల ఇష్టం వచ్చిందే చేయనివ్వాలి కాని మన ఇష్టాన్ని వారిపై రుద్దవద్దు.నలుగురితో మాట్లాడనివ్వాలి. అంతేగాని నాలుగు గోడల మధ్య  బందిఖానా చేయకూడదు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: