నేటి సమాజంలో చాల మంది సోషల్ మీడియాకు బానిసలైయ్యారు. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరు  సోషల్ మీడియా లోనే ఎక్కువసేపు బ్రతికేస్తున్నారు. పిల్లలు తమ తల్లిదండ్రుల నుంచి మొబైల్ ఫోన్ల ను తీసుకొని సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ లలో రహస్యంగా అకౌంట్లను తయారు చేసేసుకుంటున్నారు. తర్వాత వారు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో చురుకుగా ఉంటూ దానికి చాల తక్కువ సమయంలోనే బానిసలుగా మారుతున్నారు. చాలా మంది పిల్లలు తాము సోషల్ మీడియా వాడుతున్నట్లు తల్లిదండ్రుల కు తెలియకుండా ఉండేందుకు సాంకేతిక పరిజ్ఞానానంతో అనేకఎత్తులను ప్రయోగిస్తున్నారు.ఈ విధం గా పిల్లలు తమ తల్లిదండ్రుల ను సులభం గా మోసం చేసేస్తున్నారు. ఇలాంటివి నివారించాలంటే మీ పిల్లల కి సరైన వయస్సు లోనే స్మార్ట్‌ఫోన్ ఇవ్వడంమంచిది .

ఇక ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో మీ పిల్లలను సోషల్ మీడియా సైట్‌లనువాడడానికి అనుమతించినప్పటికీ వారు ఫోన్ల లో ఏం చేస్తున్నారో ఒక కంట కనిపెడుతూనే ఉండాలి.సోషల్ మీడియా లో అన్ని వయసు ల వ్యక్తులు ఉంటారు. అంతేకాక, అన్ని రకాల సమాచారం అక్కడ ఉంటుంది. అందువల్ల మీ పిల్లలకు కొంత పరికపక్వత వచ్చా కే సోషల్ మీడియా యాక్సెస్ కు అనుమతించడం సరైనది. 13 ఏళ్ల వయసు లో మీ పిల్లలను సోషల్ మీడియా కి తీసుకురావడం మంచిది.

అలా తీసుకువచ్చినా కూడా  పిల్లల సోషల్ మీడియా అకౌంట్లపై నిఘా ఉంచడం మాత్రం మరువకండి. సాధారణం గా ఈ వయసు లో పిల్లలు తమకు మొబైల్ ఫోన్ కొనివ్వాల ని తల్లిదండ్రుల ను వేదిస్తూ ఉంటారు. అయితే, ఈ వయస్సులో వాటిని నియంత్రించడం అనేది కష్టమైన పని.అటువంటి పరిస్థితి ని నివారించడానికి మీరు వారికి సోషల్ మీడియా యాక్సెస్ కల్పిస్తూనే వారి కార్యకలాపాలపై నిఘా పెట్టడం ఒక్కటే వారిని కాపాడగలిగే మార్గం అని చెప్పాలి

మరింత సమాచారం తెలుసుకోండి: