నేటితరం పిల్లలు ఎక్కువగా ఫోన్స్ తో బిజీగా గడిపేస్తున్నారు. దీని మూలంగా అతిగా బరువు పెరిగిపోవడం జరుగుతోంది.  ముఖ్యంగా పిల్లలకు ఎలక్ట్రానిక్ స్క్రీన్ లు అలవాటు చేస్తూ పోతే, అతిగా బరువు పెరిగిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయని నిపుణులు తెలియచేస్తున్నారు. ఇక ప్రతిరోజు క్రమం తప్పకుండా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వ్యాయామాలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఇక అధిక బరువు ఉన్న వారిలో ఎక్కువగా గుండెజబ్బులు, డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొన్నిరకాల క్యాన్సర్లు గుండెజబ్బులతో ఆకస్మిక మరణాలు సంబవించే అవకాశాలు ఎక్కువగా  ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. పిల్లలకు సమయానికి కంటి నిండా నిద్రపోయేలా వాతావారణాన్ని ఏర్పాటు చేయాలి. జీవితాంతం అదే అలవాట్లను అనుసరించాలని చెప్తూ వుండాలి. ఈ అలవాటు వలన భవిష్యత్తులో స్థూలకాయం, ఇతర వ్యాధుల నుంచి బయటపడవచ్చు . 

అయితే ఏడాది వయస్సు నుంచి నాలుగేళ్ల వయస్సు ఉన్న పిల్లలు రోజు మొత్తంలో కనీసం మూడు గంటల పాటు శారీరక శ్రమ కలిగేలా ఆటలు ఆడించాలి అని వైద్యులు సూచించారు. ఏడాది లోపు వయస్సు  ఉన్న పిల్లలతో  నేలపై ఆడే ఆటలుఆడించాలి అని అదేవిధంగా ఎలక్ట్రానిక్ స్క్రీన్ కి  దూరంగా పెట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది.

ఇక ఏడాది కంటే తక్కువ వయస్సుఉన్న  పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ స్క్రీన్ దగ్గరగా ఉంచకూడదు. అలా ఉండడం వలన రేడియేషన్ ప్రభావం పిల్లల లపై తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తోంది. ఐదేళ్ల లోపు పిల్లలను ఫిజికల్‌గా యాక్టివ్‌గాఉంచడానికి వారితో ఆటలు ఆడించాలని వైద్యులు చెబుతున్నారు. స్క్రీన్స్ కి అలవాటు పడినపిల్లలలో మానసిక ఎదుగుదల, విషయాలను గ్రహించే శక్తి, చురుకు, ఉత్సాహం లోపించినట్టుగా పరిశోదనలు తెలియచేస్తున్నాయి. అదే విధంగా శారీరకంగా ఆటలు ఆడినపిల్లలు ఎంతో చురుకుగా తెలివిగా ఉన్నట్టు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: