రాగులు ఆరోగ్యానికి చాల మంచిది. రాగులను ఫింగర్ మిల్లెట్ లేదా ఆఫ్రికన్ మిల్లెట్ అని పిలుస్తారు. రాగి వార్షిక ధాన్యపు పంట. పోషక విలువలు సమృద్థిగా ఉంటాయి. చాల మంది రాగి జావ చేసుకోవడం, రాగులతో సంగతి చేసుకోవడం చేసుకుని ఇష్టంగా తింటుంటారు. అయితే కొంతమంది తినరు. ఇతర ధాన్యపు గింజల్లో వేటిలోను కాల్షియం నిల్వలు రాగుల్లో ఎక్కువగా ఉంటాయి. ఎముకల బలహీనతను అరికట్టడంలో రాగులు ప్రధాన పాత్రను పోషిస్తుంది.

అయితే రాగుల్లో అమినోయాసిడ్స్, ట్రిప్టోఫాన్ అనే అమినో ఆమ్లం ఉంటాయి. ఇవి ఆకలిని తగ్గిస్తాయి. కాబట్టి బరువు నియంత్రణలో ఉంటుంది. రాగిపిండితో తయారు చేసే ఆహారాలు తీసుకోవడం వల్ల అదనపు క్యాలరీలు గ్రహించకుండా చూస్తుంది. రాగుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటడం వల్ల కడుపు నిండినట్లు అనిపిస్తుంది. మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది.

పిల్లలు పుష్టిగా ఆరోగ్యంగా ఉండాలంటే రాగి జావ ఖచ్చితంగా ఇవ్వాలని వైద్యులు చెబుతున్నారు. రాగుల్లో క్రొవ్వు తక్కువ కాబట్టి అధిక బరువుతో సతమతమయ్యేవారు వీటిని తీసుకుంటే కొద్దిరోజుల్లోనే బరువు తగ్గుతారు. గోధుమలు, అన్నం వంటివి కాకుండా రాగులు తీసుకుంటే బరువు కంట్రోల్ అవుతుంది. 28 రోజులు నిండిన వారికి రాగిజావను పెడుతుంటారు పెద్దవారు. అది చాలామంచిది. రాగి జావను మితంగా తీసుకోవాలి. అదే ఎక్కువగా తీసుకుంటే విషంతో సమానమంటున్నారు వైద్య నిపుణులు.

రాగులలో క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ మరియు మినిరల్స్ , అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది. ఈ ధాన్యంలో లోఫ్యాట్ శాతాన్ని కలిగి ఉంటుంది మరియు ముఖ్యంగా అసంతృప్త కొవ్వు కలిగి ఉంటుంది . ఇది చాలా సులభంగా జీర్ణమైవుతుంది మరియు బంక అనిపించదు. ఎవరైతే గ్లూటెన్ లోపంతో బాధపడుతున్నారో వారు ఈ ధాన్యాహారాన్ని తీసుకోవచ్చు. రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. రాగులు బలవర్దకమయిన ధాన్యం. దానిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అమితపుష్టిని కలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: