రంగయ్య అనే ఒక పేదవాడు టోపీలు కుట్టుకొని పొరుగురులో వాటిని అమ్మి జీవనం గడిపేవాడు. ఒక రోజు ఎండలో తిరిగి టోపీలు అమ్మి అలసిపోయి, ఒక చెట్టు కిందకు వచ్చి టోపీలు పెట్టె ప్రక్కన పెట్టి ఆ చెట్టు కిందే నిద్రపోయాడు. ఆ చెట్టు పైన చాలా కోతులు నివసిస్తున్నవి. ఆ కోతులు నిద్రించే రంగయ్య తలపై ఉన్న టోపిని చూసి, కిందకు దిగివచ్చి పెట్టెలో వున్న టోపీలన్నీ తీసుకొని తలా ఒక టోపీని పెట్టుకొని గంతులు వేస్తున్నవి కోతులు. కోతుల అరుపులకూ, అల్లరి చేష్టలకు, రంగయ్యకు మెలకువవచ్చి టోపీల పెట్టెవైపు చూసాడు పెట్టెలోని టోపీలు ఏమైనావా ? అని తలపైకెత్తి చూసాడు. తన పెట్టెలోని టోపీలు పెట్టుకొని చెట్టుపైన కులుకుతున్న కోతులను చూసి వాడికేమి చేయాలో తోచలేదు. కొంతసేపు ఆలోచించి కోతులు తనను చూస్తున్న సమయంలో తన తలపై ఉన్న టోపీ తీసి నేలపై విసిరాడు. అది గమనించిన కోతులు వాటి తలలపై ఉన్న టోపీలను కూడా తీసి నేలమీదికి విసిరాయి. తన పాచిక పారినందుకు రంగయ్య సంతోషింతో ఆటోపీలన్నీ ఏరి పెట్టెలో వేసుకుని తన దారినతాను వెళ్ళిపోయాడు. ఈకథలోని నీతి : కఠిన సమస్యలు కూడా ఉపాయంతో సాధించవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: