యోగాసనాలు మనుషులకు ఎంతో అవసరం. ప్రతి యోగాసనాలు చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పెద్ద వాళ్లకే కాదు.. చిన్నపిల్లలకు ఇది ఎంతో ఉపయోగకరం. ప్రస్తుతం చాలా మంది తల్లిదండ్రులకు పెద్ద సమస్య.. తమ పిల్లలు ఎత్తు పెరగడం లేదని. వయసు పెరిగే కొద్ది పిల్లలు ఎత్తు పెరగకపోతే.. తల్లిదండ్రులు ఎంతో ఆందోళనకు గురవుతారు. కానీ, ఇప్పుడా భయం లేదు.

పిల్లల ఎత్తు పెంచేందుకు యోగాసనాలు ఎన్నో ఉన్నాయి. ఆసనాలు వేయడం వల్ల పిల్లలు శారీరంగా, మానసికంగా ధృడంగా ఉంటారు. చిన్నప్పుడు పిల్లలు తినే ఆహారం, ఆరోగ్యంపైనే వారీ యవ్వనం, వృద్ధాప్యం ఆధార పడి ఉంటుంది. అందుకే చిన్నప్పుడు పిల్లలను పౌష్టికాహారాన్ని, శారీరక శ్రమను అలవాటు చేయాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం పిల్లలు ఎత్తు పెరగడానికి సంబంధించిన కొన్ని యోగాసనాల గురించి తెలుసుకుందాం.

తాడాసనం..
తాడాసనం చాలా ఈజీ ప్రాసెస్. ముందుగా పిల్లలను నిటారుగా నిలబడమని చెప్పండి. రెండు కాళ్లు దగ్గరికి పెట్టుకునేలా చూసుకోవాలి. అలా స్ట్రెయిట్‌గా నిలిచున్నప్పుడు తన రెండు చేతులు పైకి అని సాధ్యమైనంత వరకు స్ట్రెచ్ చేయాలి. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల హైట్ పెరిగే అవకాశం ఉంటుంది.

పాదహస్తాసనం...
ఈ ఆసనం చేసేటప్పుడు పిల్లలను నిటారుగా నిలబెట్టాలి. బ్రిత్ ఇన్.. బ్రిత్ అవుట్ చేస్తూ శరీరాన్ని బెండ్ చేయాలి. చేతులను కాలి వేలికి పట్టుకోవాలి. దీంతో వెన్నెముక ఎక్సర్‌సైజ్ అవుతుంది. శరీరం బాగా స్ట్రెచ్ అవుతుంది.

వృక్షాసనం..
ఈ ఆసనం కొంచెం కష్టంతో కూడుకుంది. దీనికి బ్యాలెన్సింగ్ చాలా అవసరం. ఈ ఆసనంలో పిల్లాడి కుడి కాలుని ఎడమ కాలి తొడకు ఆనించాలి. శరీరం మొత్తం నిటారుగా ఉంచాలి. చేతులు పైకి లేపి సూర్య నమస్కారం చేయాలి. ఇలా చేస్తే ఎత్తు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

వ్యాయామంతోపాటు.. ఆహారంపైన కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పిల్లలకు కూల్ డ్రింక్స్, చిరుతిళ్లకు దూరంగా ఉంచాలి. వీలైనంతవరకు పిల్లలను బయటకు వెళ్లి ఆడుకోమని ప్రోత్సాహించండి. మానసికంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడే పిల్లలు శారీరంగా వృద్ధి చెందుతారు. అయితే ఈ ఆసనాలు వేసేటప్పుడు యోగా టీచర్ సలహాలు సూచనలు తీసుకోండి. లేదా మీరే మీ పిల్లలను యోగాసనాలు క్లాసులకు పంపండి.

మరింత సమాచారం తెలుసుకోండి: