ప్రస్తుత కాలంలో ఎంతో మంది యువకులు పెళ్ళిళ్ళు అవ్వక, అమ్మాయిలు దొరకక, ఒక వేళ దొరికినా నువ్వు సాఫ్ట్ వేరా , హార్డ్ వేరా అంటూ పిల్ల తల్లితండ్రులు , అమ్మాయిల యక్ష కోరికలతో విసిగి వేసారి పోతున్నారు. అబ్బాయికి అలవాట్లు ఉన్నా ఇప్పుడవన్నీ మామూలే, , సాఫ్ట్ వేర్ ఇంజనీర్, ప్రభుత్వ ఉద్యోగి  (అదీ కూడా గెజిటెడ్, నాన్ గెజిటెడ్ – చిన్నా చితకా కాదు సుమీ) అయితే చాలు పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. ఇక వాడి ఖర్మ కాలి ఎదో ప్రవైటు జాబు అయితే నెలకు ఓ లక్ష రూపాయలు అయినా జేబులో వచ్చి పడాల్సిందేనని కండిషన్లు పెడుతున్నారు. పిల్ల తల్లి తండ్రులు ఆ మాత్రం ఆలోచన చేయకపోతే ఎలా అనుకుంటున్నారా..సరే ఎవరి ఇష్టం వారిది కానీ
ఓ మోస్తరు ఉద్యోగం చేసుకునే వాడితే వాడి పని గోవిందా..గోవిందా...ఇక ఆ ఏడు కొండలవాడే దిక్కు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇక అన్నం పెట్టె రైతన్న పరిస్థితి మరీ ఘోరం. యువకులు ఎంతో మంది చక్కని చదువు చదివినా వ్యవసాయం మీద ప్రేమ, గౌరవంతో వ్యవసాయ రంగంలోకి అడుగుపెడుతున్నారు. మంచి లాభాలు గడిస్తున్నా వ్యవసాయంపై ఉండే చిన్న చూపుతో ఆడపిల్లల తల్లి తండ్రులు వ్యవసాయం చేసే యువకులకు పిల్లలను ఇవ్వడానికి ముందుకు రావడంలేదు. అయితే ఇప్పుడు కాలం మారింది..కాలంతో పాటు మనుషులు కూడా మారుతున్నారు..అక్కడక్కడా చచ్చు పుచ్చు బుర్రలు ఉన్నా వ్యవసాయం చేసుకునే యువ రైతులను పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఉన్నత చదువులు చదువుకుని, ప్రభుత్వ శాఖలలో కీలక బాధ్యతలు పోషిస్తున్న యువతులు కూడా రైతులను పెళ్ళిళ్ళు చేసుకోవడానికి సిద్దమంటున్నారు...ఇదెక్కడో కాదు..
అంటున్నాడు తెలంగాణాకు చెందిన ఓ యువకుడు. రైతులను పెళ్ళిళ్ళు చేసుకోవడానికి పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా క్యూలు కడుతున్నారని, కాలం మారిందని, ఒకప్పుడు రైతులను పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఆలోచించే అమ్మాయిలు ఇప్పుడు రైతులతో పెళ్ళిళ్ళ కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారని అమ్దుకోసమే రైతుల మ్యారేజ్ బ్యూరో కూడా ఏర్పాటు చేసామని అంటున్నారు.తాను ఏర్పాటు చేసిన మ్యారేజ్ బ్యూరోలో కేవలం రైతులకు మాత్రమే పెళ్ళిళ్ళు కుదుర్చుతున్నారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా రైతులకు మ్యారేజ్ బ్యూరో స్థాపించి రికార్డ్ సృష్టించాడు. మొదట్లో పెద్దగా స్పందనన లేకపోయినా తరువాత రైతులతో పెళ్ళిళ్ళకు దరఖాస్తులు వచ్చి పడుతున్నాయట.
ఓ మహిళా MRO రైతులను పెళ్లి చేసుకుంటామని దరఖాస్తు కూడా ఇచ్చారని సదరు మ్యారేజ్ బ్యూరో వ్యక్తీ తెలిపాడు. ఆమె బాటలోనే మరి డాక్టర్లు, లాయర్లు, సాఫ్ట్ వేర్ ఉద్యోగినులు కూడా ఉన్నారని ప్రకటించాడు.  అందుకు కారణం కూడా తెలిపాడు.సాధారణ ఉద్యోగం కంటే కూడా వ్యవసాయంలో అధిక లాభాలు గడిస్తున్నారని. ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగ సంపాదన కంటే కూడా రైతు సంపాదన ఎక్కువగా ఉండటంతోపాటు , నగరాలకంటే కూడా పల్లెలులో జీవనం ప్రశాంతంగా ఉంటంది కాబట్టే మహిళలు రైతులను పెళ్లి చేసుకోవడానికి సై అంటున్నారట.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: