మనం పూర్వీకులు ఇంకా బలంగా ఉండడానికి గల ముఖ్య  కారణం ఏమిటంటే, వారు బాగా మంచి ఆహారాన్ని తినే వారు. కాబట్టి అందుచేతనే అంత బలంగా ఉంటారు. ఇక ప్రస్తుతం ఉన్న యువకులు, ఇప్పుడు 30 సంవత్సరాలకే కాళ్ల నొప్పులు అని అంటుంటారు. అయితే ఇలా వారు గట్టిగా ఉండడానికి, ఇలా కాళ్లు నొప్పులు అని ఇప్పుడున్న యువకులు అనడానికి. ఆహార లోపం అని చెప్పవచ్చు. అయితే మన పూర్వీకులు ఎలాంటి ఆహారాన్ని తినేవారో చూద్దాం.

మన తాతలు ,ముత్తాతలు కేవలం మట్టి కుండలోని భోజనాన్ని వండుకునే వారు. అదికూడా కట్టెల పొయ్యి మీదే. అలాంటి పాత్రల్లోనే కూరలు కూడా చేసేవారు, ఈ పాత్రలో వంట చేయడంవల్ల అందులో ఉండేటువంటి ఖనిజాలు బాగా ఆహారానికి అందుతాయి. ఆహారం కూడా ఎంతో రుచిగా ఉంటుంది. అందుచేతనే వారు చాలా బలంగా ఉంటారు.

ఇక ప్రస్తుతం మనం వాడుతున్నది అంతా ఎలక్ట్రానిక్, పాత్రలను ఎక్కువగా వాడుతున్నాము. అలాంటి వాటిలో ఎక్కువగా పోషకాలు ఉండవు. అందుచేతనే మనకు కాళ్ల నొప్పులు, సచ్చు వంటివి వస్తూనే ఉంటాయి. ఇక అంతే కాకుండా మట్టికుండలో కూరలు చేయడం వల్ల అందులోని నూనె శాతం తక్కువగా ఉంటుంది. అందుచేతనే వారు లావు కాకుండా ఉంటారు.

ముఖ్యంగా మట్టిలో క్యాల్షియం మరియు మెగ్నీషియం వంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి మన ఆహారంలో తక్కువగా ఉండటం వల్ల ఇలాంటి పాత్రలో వండటం చేత, అవి మనకి బాగా పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదు మట్టి కుండలో వంట చేసుకుని తినడం వల్ల ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవు. ముఖ్యంగా ఇటీవల కాలంలో చాలా మంది మహిళలు శరీరంలో వేడి ఉంది అని తెగ ఇబ్బంది పడుతున్నారు. అలాంటివారు మట్టి కుండలో నీటిని నిల్వ చేసి తాగడం వల్ల ,శరీరానికి చలవ లభించడమే కాకుండా మన శరీరానికి కావలసిన పోషక ఖనిజాలు కూడా లభిస్తాయి. కాబట్టి ఇకనైనా మట్టి పాత్రలో వండుకుని తినడం అలవాటు చేసుకోండి.


మరింత సమాచారం తెలుసుకోండి: