సాధారణంగా ప్రతీ ఇంట్లో మిర్చి లేదా కారం పొడిని తప్పక వాడుతుంటారు. అయితే, పచ్చి మిర్చి కుండే టేస్ట్ ఒకలా ఉంటే కారం పొడి ద్వారా వచ్చే టేస్ట్ మరోలా ఉంటుందన్న సంగతి అందరికీ విదితమే. ఇకపోతే మిర్చి అనగానే అందరూ గుంటూరు మిర్చి బాగా ఫేమస్ ప్లస్ ఘాటైన మిర్చి అనుకుంటారు. కానీ, దీనికి మించిన మిర్చి మరొకటి ఉందట. అదే దెయ్యం మిర్చినట.. అదేంటీ? దెయ్యం మిర్చి ఏంటి? అనుకుంటున్నారా? అవునండీ.. అది దెయ్యం మిర్చినేనట..ఇంతకీ అదెక్కడ పండుతుంది? అనేది తెలియాలంటే మీరు ఈ కథనాన్ని పూర్తిగా చదవాల్సిందే.

దెయ్యం మిర్చి ఈశాన్య భారతంలో పండుతుంది. దీనినే భూత్ జోలోకియా అని అంటారు. దీనికి చాలా పేర్లున్నాయి. ‘కింగ్ మిర్చి, రాజా మిర్చి, నాగా మిర్చి, గోస్ట్ పెప్పర్’ అని కూడా స్థానికులు పిలుస్తుంటారు. విపరీతమైన ఘాటుగా ఉండటం వల్లే దీనికి ‘కింగ్ మిర్చి’ అని పేరొచ్చిందని స్థానికులు చెప్తుంటారు. భారత్‌లోని మిర్చీలన్నిటికీ ఇది రాజు అని పేర్కొంటున్నారు స్థానికులు. నాగాలాండ్‌లో ఎక్కువగా పండుతుందని కాబట్టి, దీనిని నాగా మిర్చి అనే కూడా అంటారు. 2007లో దీనిని అత్యంత ఘాటైన మిర్చిగా గిన్నెస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ గుర్తించింది. వరల్డ్‌లోనే అత్యంత ఘాటైన మిర్చీల్లో ఒకటి అయిన ఈ పచ్చి మిర్చీతో తయారు చేసిన వంటలు లేదా పిండితో చేసిన టిఫిన్స్ తింటే దెయ్యం పట్టినట్లుగా నేలపై పడి కొట్టుకుంటారట. కడుపు, ఛాతీలో విపరీతమైన మంటలను ఈ మిర్చి పుట్టిస్తుందట. అత్యంత ఘాటైన ఈ మిర్చిన తొలిసారిగా భారత్ బ్రిటన్‌ దేశానికి ఎక్స్‌పోర్ట్ చేసింది. ఇప్పటి వరకు ఈ మిర్చి పౌడర్ మాత్రమే ఎక్స్‌పోర్ట్‌గా ఇప్పుడు మిర్చి కూడా ఎగుమతి చేయబడింది. ఈ విషయమై భారత ప్రధాని సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు.  మిర్చి తిన్నవారికి మాత్రమే దాని అసలు ఘాటో ఏంటో తెలుస్తుందని మోడీ తెలిపారు. ఈ మిర్చి నాలుగు నుంచి ఐదు అంగుళాల పొడవుతో ఆకుపచ్చ రంగుతో పాటుగా రెడ్, చాక్లెట్ రంగుల్లో కనిపిస్తుంది. ఫుడ్ ఐటమ్స్‌లో ఘాటు పెంచేందుకుగాను, ఊరగాయల్లోనూ అనగా పచ్చడల్లోనూ వీటిని ఉపయోగిస్తారు. ఇకపోతే మాంసం వంటకాల్లో వీటిని వాడితే మంచి రుచి వస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: