జాతీయగీతం..జనగణమన అనే సంగతి అందరికీ తెలుసు కానీ ఆ గీతం పూర్తి లిరిక్స్ చాలా తక్కువ మందికి తెలుసు. అందుకే ఈ స్వతంత్ర దినోత్సవాన మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. 



జనగణమన-అధినాయక జయ హే

 

భారత భాగ్య విధాతా!

 

పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ బంగ

 

వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్ఛల జలధితరంగ

 

తవ శుభ నామే జాగే, తవ శుభ ఆశిష మాగే,

 

గాహే తవ జయ గాథా।

 

జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాతా!

 

జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ జయ హే।।

 

జై హింద్‌!

 

 

జనగణమన భారత దేశ జాతీయ గీతం. నోబెల్ బహుమతి గ్రహీత, రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఒక బెంగాలీ గీతంలోని మొదటి భాగాన్ని మనం  జాతీయ గీతంగా ఎంచుకున్నాం. ఈ పాటను 1911 డిసెంబర్ 27న కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో  మొదటి సారిగా జనగణమన పాడారు. 1912 జనవరి లో ఈ గీతాన్ని "తత్వ భోదిని" అనే పత్రిక "భారత విధాత" అనే పేరుతో ప్రచురించింది కూడా. 1950 జనవరి 24న ఈ గీతాన్ని జాతీయ గీతంగా రాజ్యాంగ సభ స్వీకరించింది. ఈ గీతానికి సంగీత బాణీ కూడా ఠాగూర్ స్వయంగా సృష్టించాడు. బాణీ కనుగుణంగా ఈ గీతాలాపన చేసేందుకు 52 సెకన్ల సమయం పడుతుంది. ఇక ఆ పాట అర్ధం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

 

 

తెలుగు లో దీని అర్థం...ఏమిటంటే... 

పంజాబు, సింధు, గుజరాత్ మహారాష్ట్ర లతో కూడిన పశ్చిమ తీర ప్రాంతం 

 తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, తుళు భాషలతో కూడిన ద్రావిడ ప్రాంతం

ఒరిస్సా మొదలైన రాష్ట్రాలతో కూడిన తూర్పు తీర ఉత్కల ప్రాంతం మన దేశం సొంతం.

ఈశాన్య రాష్ట్రాలతో కూడిన బెంగాల్ ప్రాంతం.. 

వింధ్య హిమాలయ పర్వతాలు, యమున గంగలు పై కంటే ఎగసే సముద్ర తరంగాలు ఇవన్నీ.. తమరి శుభ నామమే తలుచుకుంటూ ఉన్నాయి. 

తమరి శుభ ఆశిస్సులు నే కోరుకుంటున్నాయి. తమరి విజయగాధనే పాడుకుంటున్నాయి. ఓ జనసమూహాల మనసులో ఉన్న అధినాయకా.. మీకు జయము! ఓ భారత భాగ్య విధాత, మీకు జయము! నిత్య జయము! అంటూ సాగిపోతుంది. 

 

ఇక మీదట జనగణమన పాడినప్పుడు దాని అర్ధాన్ని కూడా ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోండి. ఎందుకంటే... ఈ తరం వారం అయిన మనం గుర్తుపెట్టుకుంటే తర్వాత తరం వారికి సూటిగా చెప్పగలుగుతాం..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: