సాధారణంగా ఇంట్లో ఒకరోజుకు మించి పాలు నిల్వ ఉంచడం అంటే ఖచ్చితంగా అవి చెడిపోతాయి. ప్రస్తుతకాలంలో అందరి ఇళ్ళల్లో రిఫ్రిజిరేటర్లు ఉంటున్నాయి కాబట్టి పాలు చెడిపోతాయి అనే భయం లేదు ..కానీ కొన్ని కొన్ని సార్లు రిఫ్రిజిరేటర్ లో పెట్టడం మర్చిపోతే ఖచ్చితంగా పాలు చెడిపోవడం ఖాయం. ఇక లీటర్ల కొద్దీ పాలను చెత్త లో పడేస్తూ ఉంటాం. ఇకపోతే చెడిపోయిన పాలను పడేయకుండా అద్భుతమైన వంటకాలు కూడా తయారు చేయవచ్చు.. చెడిపోయిన పాలతో రుచికరమైన వంటలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

ఇంట్లో పాలు చెడిపోతే ఎటువంటి సంకోచం చెందకుండా రకరకాల స్వీట్లు తయారు చేసి పిల్లలకు కూడా తినిపించవచ్చు. ఇలా చేయడం వల్ల ఎటువంటి హానికరం కూడా జరగదు..

చెడి పోయిన పాలతో మిల్క్ కేక్ తయారు చేయవచ్చు.. అది ఎలాగంటే.. ఒక గిన్నె తీసుకుని అందులో రెండు కప్పుల కేక్ పౌడర్ వేయాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, నాలుగు టేబుల్ స్పూన్ల షుగర్ పౌడర్ యాడ్ చేసి కొద్దిగా కిస్మిస్, డ్రైఫ్రూట్స్ కలపాలి. ఇప్పుడు రెండు కప్పుల పాలు మరో రెండు కప్పుల నీళ్ళు వేసి బాగా కలపాలి. వెన్న తో పాటు గుడ్డు ను కూడా వేసి బాగా గిలకొట్టండి.. వెన్న రాసిన బేకింగ్ తీసుకొని అన్ని కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసి 300 డిగ్రీ సెల్సియస్ వద్ద, కేవలం 25 నిమిషాల పాటు బేక్ చేస్తే రుచికరమైన మిల్క్ కేక్ రెడీ అవుతుంది.

ఇక అంతే కాదు వెన్న, డోనట్స్, కలాకండ్ లాంటి రుచికరమైన పదార్థాలను కూడా తయారు చేసుకోవచ్చు. మీ ఇంట్లో కూడా ఒకవేళ అనుకోని సందర్భాలలో పాలు చెడిపోయినట్లయితే కొంచెం టైం పట్టినా సరే ఆ పాలను పడేయకుండా ఇలాంటి రుచికరమైన వంటలను తయారు చేసి ఇంటిల్లిపాది ఆనందంగా తినండి.


మరింత సమాచారం తెలుసుకోండి: