నేటి సమాజంలో కొందరు సాధించడం అనే పదానికి కొత్త అర్ధం చెపుతున్నారు. నిజానికి ఎవరి సామర్థ్యం బట్టి వాళ్ళు సాదిస్తుంటారు. ఒకళ్ళు విద్యలో ముందుంటారు, ఇంకొందరు ఆటల్లో, మరి కొందరు సంపాదించడంలో ఇలా ఆయా రంగాలలో వాళ్ళు వాళ్ళ ప్రతిభతో ముందుకు పోతుంటారు. ఆయా రంగాలలో వారి ప్రావీణ్యత నిరూపించుకుంటారు. ఇలాంటి విజయాలు సాధించడంలో ఈ తరం ముందుంది అనే చెప్పాలి. కొత్తకొత్త విషయాలలో వీళ్లు విజయాలు సాధిస్తున్నారు. సాధారణంగా అందరు చేసే సాధన కాకుండా కాస్త కొత్తగా ఆలోచించి వీళ్లు చేస్తున్న సాహసాలు సామాజిక మాధ్యమాలలో కూడా హల్ చల్ చేస్తూనే ఉన్నాయి.

ఎవరి ప్రావీణ్యత వాళ్ళది, దాని ప్రకారమే వాళ్ళు ముందుకు పోతుంటారు. చిన్న వాళ్ళు, పెద్ద వాళ్ళు అనే మీమాంస లేకుండానే  వీళ్లంతా విజయాలు సాధిస్తున్నారు. తనను తాను తగ్గించుకునే ఆలోచనలు చాలా వరకు ఈ తరం లో తగ్గిపోతున్నాయి. దీనితో ఉన్నదానిలోనే గొప్ప పనులు చేసి మంచి గుర్తింపు పొందుతున్నారు. అలాగే కొందరు వీటివలన తాము అనుకున్న రంగాలలో అవకాశాలు కూడా పొందుతూ ఉన్నారు. తాజాగా చెన్నై కి చెందిన ఒక ఆటోవాలా తన ఆటోతో చేసిన విన్యాసాలకు గిన్నిస్ రికార్డ్ సాధించాడు. ఊరికే ఆటో నడిపితే ఎవరు ఇస్తారు రికార్డ్, అందుకే రెండు చక్రాలపై ఆటో నడిపి ఈ ఘనత దక్కించుకున్నాడు.  

ఇది కూడా అతడు ఎప్పుడో 2015లో చేసింది. దానికి ఇప్పుడు ఫలితం వచ్చింది. అతడు చేసిన వీడియో గిన్నిస్ వాళ్ళు చూసి అతడికి గిన్నిస్ రికార్డ్ వారు అవకాశం ఇచ్చారు. దానితో అతడు ఏకంగా 2.2 కిలోమీటర్లు ఆటోను రెండు చక్రాల మీద నడిపి చూపించాడు. దానికి ఆశ్చర్యపోయిన అధికారులు గిన్నిస్ రికార్డ్ లో ఈ  ఆటో వాలా  పేరును చేర్చేశారు. దీనిపై ఆటోవాలా మాట్లాడుతూ, తాను ఎప్పుడు ఇలాంటి అవకాశం వస్తుందని ఆశించలేదని, అయినా తన ప్రతిభను గిన్నిస్ వాళ్ళు గుర్తించి అవకాశం ఇచ్చినందుకు కృతఙ్ఞతలు అని చెప్పాడు. అతడు చెన్నైకి చెందిన ఆటో రిక్షా డ్రైవర్ జగదీష్.

మరింత సమాచారం తెలుసుకోండి: