బతుకమ్మ పండగ స్టార్ట్ అయింది. పండగ సందర్భంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి బతుకమ్మ పాటలు స్పెషల్ గా రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. పలు మీడియా చానల్ లతో పాటు ప్రభుత్వం కూడా ఈ పండుగను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఈ మేరకు కొన్ని ఛానల్ లో ప్రత్యేకంగా బతుకమ్మ కోసం సాంగ్స్ ను రూపొందిస్తున్నాయి. మరో వైపు ఎమ్మెల్సీ కవిత కూడా బతుకమ్మ  లో భాగమయ్యారు. ఆమె తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా ఉంటారు. తెలంగాణలో ప్రత్యేకంగా జరుపుకునే బతుకమ్మ సంబరాల గురించి కవిత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. 

అప్పట్లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొనసాగుతున్న ప్రజా ఉద్యమం నుండి  ప్రేరణ పొందడంతో పాటు ప్రజల సంక్షేమం కోసం పని చేయాలని ఆమె బలమైన కోరిక 2006 ఆగస్టు లో తెలంగాణ జాగృతి అనే సంస్థను ఏర్పాటు చేయడానికి దారి తీసింది. తెలంగాణలోని ప్రజల ఐక్యతను మేల్కొల్పడం దీని లక్ష్యం. ఇక దీని ద్వారా యువతకు ఉపాధి అందించడమే కాకుండా పలు కార్యక్రమాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలను కూడా నిర్వహించి తెలంగాణ సంస్కృతి ని ప్రపంచ దేశాలను చాటి చెప్పారు. ప్రస్తుతం 30కి పైగా దేశాల్లో బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.    

ఇదిలా ఉండగా తాజాగా కవిత ఈ ఏడాది కూడా బతుకమ్మ పాటను లాంచ్ చేసింది. ఈ పాటకు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించగా ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చారు. మిట్టపల్లి సురేందర్ సాహిత్యం అందించగా, ఈ వీడియోలో మేఖ రాజన్, అనఘ, ఏంజెలీనా తో పాటు పలువురు నటించారు. రక్షిత సురేష్, హరిప్రియ, దీప్తి సురేష్, అపర్ణ హరికుమార్, పద్మజా ఈ పాటను పాడారు. ఇక ఈ పాటను విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలు ప్రమోట్ చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: