భారతదేశ రాజధాని రోజురోజుకు కాలుష్య కోరలలో చిక్కుకుని అల్లాడుతోంది. ఇప్పటికే ఎంతో ప్రమాదకర స్థితిలో ఉన్న అక్కడ పరిస్థితి మళ్ళీ పెరిగి మరోస్థాయికి చేరింది. దీనివలన అక్కడ గాలి పీల్చడానికి కూడా ప్రమాదకరంగా ఉంది. మనిషికి ఎంతో అవసరమైన ప్రాణవాయువు కూడా స్వచంగా లేకపోవడంతో అక్కడి ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారు. పైగా వస్తున్నది పండుగల సీజన్, బాణాసంచా లాంటివి ఇప్పటికే నిషేదించిన రాష్ట్రంగా రాజధాని ఉంది. మరోవైపు పొరుగు రాష్ట్రాల లో ఏ చిన్న కాలుష్య ప్రభావిత పరిణామం సంభవించినా యావత్ రాజధాని పై ఈ ప్రభావం పడుతుంది. గతంలో కూడా పొరుగు రాష్ట్రాలలో ఉన్న రైతులు తమ పొలాలలో మిగిలిన గడ్డిని కాల్చేసినందుకే రాజధాని మొత్తం పొగతో కమ్మేసుకుంది.

ఇంత సున్నితంగా వాతావరణం ఉన్న రాజధానిలో ప్రస్తుత పరిస్థితులు మరింతగా క్షిణించాయి. రాజధాని ఆనంద్ విహార్ ప్రాంతంలో గాలి నాణ్యత బాగా క్షిణించింది. అక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏ.క్యూ.ఐ) ఒక్కసారిగా 322 కు చేరుకుంది. గాలి కాలుష్య రకాలైన పీఎం 2.5, పీఎం 10 రాజధానిలో బాగా పెరిగిపోయినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఋతుపవనాలు వెళ్లినందున తిరిగి రాజధాని లో గాలి నాణ్యత పూర్వస్థితికి వస్తుందని నిపుణులు అంటున్నారు. ఏ.క్యూ.ఐ. 171 ఉంటేనే అది ప్రమాదకరం కానీ ఏకంగా 322 కు పెరిగిందంటే తగిన జాగర్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

రాజధాని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ, గాలిలో కాలుష్యం పెరిగిపోతుందని, అతివేడి కారణంగా ఈ పరిణామాలు వస్తున్నాయని ఆయన అన్నారు. గత నెల రెండో వారం నుండి ఈ పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ నెల మధ్య కల్లా ఈ స్థితి మరింత క్షిణిస్తుందని ఆయన అన్నారు. ఎన్.సి.ఆర్. ప్రాంతాలలో కొత్త సాంకేతికతను ఉపయోగించి ధర్మల్ పవర్ ప్లాంట్ లను రిట్రాఫిట్ చేయాలని ఆయన అన్నారు. ఆయా ప్రాంతాలలో గ్యాస్ ఆధారిత లేదా విద్యుత్ వాహనాలు ఎక్కువగా వాడటం ద్వారా ఈ స్థితి నుండి బయట పడవచ్చని ఆయన సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: