సాధారణంగా మనం తినే వివిధ రకాల ఆహారాలు కారణంగా, అలాగే మనం నివసించే పర్యావరణం పరిసరాల కారణంగా కూడా మన శరీరంలో మార్పులు వస్తాయి అన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. చాలామంది చెప్పే విషయం ఏమిటంటే.. మనం తినే కూరల్లో ఉప్పు లేదా కారం ఎక్కువగా తిన్నప్పుడు బిపి వచ్చే అవకాశం ఉంటుందని చెబుతూ ఉంటారు. ఇందుకోసం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వీటిని అదుపు లోకి తెచ్చుకోలేక జీవితాంతం బీపీ ని కంట్రోల్ చేసుకోవడం కోసం మాత్రలను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మాత్రలను ఉపయోగించడం వల్ల దీర్ఘకాలికంగా అవయవాల పనితీరు దెబ్బతింటుందని అనే విషయం తెలిసినప్పటికీ తప్పని పరిస్థితులలో ఈ మాత్రలను తింటూ ఉంటారు.


అయితే ఇలా భోజనం చేయడం వల్ల బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ లో ఉంటుందట. ఈ మధ్యకాలంలో కుర్చీలు, బెంచీలు , టేబుల్స్  వచ్చిన తర్వాత చాలామంది కింద కూర్చొని భోజనం చేయడమే మానేశారు. టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేయడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవడం కాకుండా అధిక బరువు పెరుగుతున్నారు. తిన్న ఆహారం కూడా సరిగా జీర్ణం కాక ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే నేల మీద రెండు కాళ్లను మడతపెట్టి కూర్చొని భోజనం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు నిపుణులు.


సాధారణంగా కింద కూర్చుని భోజనం చేయడం వల్ల భోజనం నేరుగా కిందికి రావడమే కాకుండా జీర్ణక్రియ కూడా వేగంగా జరుగుతుంది. రక్త సరఫరా మెరుగుపడి బ్లడ్ ప్రెజర్ కూడా అదుపులో ఉంటుంది. ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వడమే కాకుండా అవయవాల పనితీరు కూడా మెరుగుపడుతుంది. నేలపై కూర్చుని భోజనం చేసే వాళ్ళు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా శరీర అవయవాలు కూడా చక్కగా పనిచేస్తాయి అని వైద్యులు చెబుతున్నారు. ఇకపై కుర్చీలు, బెంచీలు పై కూర్చుని భోజనం చేయడం కన్నా నేలపై కూర్చుని భోజనం చేయడం అలవాటు చేసుకుంటే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: