మహిళా సాధికారత, దీని గురించి మాట్లాడమంటే గంటలు గంటలు మాట్లాడతారు కానీ పాటించడానికి మాత్రం ఎవరికి సాధ్యం కానిపని. చాలా విషయాలు మాటలలో ఉన్నంతగా చేతల వరకు రావడం లేదు అంటున్నాయి అంతర్జాతీయ పరిశోధనలు. దీనిపై మొదటిసారి అంతర్జాతీయస్థాయిలో అధ్యయనం కూడా చేసింది ఒక బృందం. వారి అధ్యయనం ప్రకారం మహిళల వేతనం చాలా వరకు పురుషులకు తగ్గట్టుగా లేదా సమానంగా ఉండటం లేదని తేలింది. దీనికోసం వాళ్ళు దాదాపు 45 దేశాలలో 1973-2016 వరకు అందుబాటులో ఉన్న సంబంధిత సమాచారాన్ని పరిశీలించారు. ఈ అధ్యయనం బెంగుళూరు లోని ఐఐఎం లో పబ్లిక్ పాలసీ విభాగం వారు ప్రొఫెసర్ స్వామినాధన్ హేమ, ప్రొఫెసర్ మల్గన్ దీపక్ చేశారు.

వారు ఈ అధ్యయనం కోసం 28.5 లక్షల కుటుంబాల లోని 18-65 ఏళ్ళ మధ్య ఉన్న జంటల వేతన సమాచారాన్ని దీనికోసం పరిశీలించారు. ఈ సమాచారాన్ని లంకెన్స్ బర్గ్ ఇన్కమ్ స్టడీ(ఎల్.ఐ.ఎస్) సేకరించినట్టు తెలుస్తుంది. సాధారణంగా ఇలాంటి అధ్యయనాలు జరిగినప్పుడు కుటుంబాలను ఒక యూనిట్ గా తీసుకుంటారు. ఎందుకంటే అందులో ఉన్న ప్రతి ఒక్కరు తమ వేతనాన్ని ఒకచోట చేర్చి అందరి అవసరాలకు తగ్గట్టుగా ఖర్చు చేస్తారు. కానీ ఇక్కడ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అసమానతలు లెక్కలోకి రావు. అలాంటి లోటు లేకుండా ఉండేందుకే ఈ అధ్యయనం చేసినట్టు స్వామినాధన్ తెలిపారు. ఈ అధ్యయనం ప్రకారం ప్రతి ఇళ్లు ఒక పెట్టె అనుకుంటే అందులోకి చూడటం సాధ్యం కాదు కానీ, దానిని బయట నుండి చూడవచ్చు. అయితే లోన జరిగే విషయాలు తెలుసుకోవడం మాత్రం అసాధ్యం.

భారతదేశంలో ఇంకా ఉద్యోగాలు చేసే మహిళలు తక్కువే. అదికూడా వేతనాలలో పురుషులతో పోల్చి చుస్తే తేడాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ అంశాలు అంతర్జాతీయంగా వివిధ దేశాలలో ఎలా ఉన్నాయో కూడా ఈ అధ్యయనం తెలుపుతుందని పరిశోధకులు అన్నారు. ఉదాహరణకు ఉత్తర ఐరోపా, ఉత్తర అట్లాంటిక దేశాలలో జెండర్ సమానత్వాలు బాగా కనిపిస్తాయి.  అయినా ఆయా కుటుంబాలలో అసమానతలు ఎలా ఉన్నాయి, దంపతుల మధ్య పని, సంపాదన సమానంగానే ఉన్నాయా, అనేవి ఈ అధ్యయనం ద్వారా తెలిసిపోతాయని స్వామినాధన్ తెలిపారు. అయితే జెండర్ అసమానతలు, వేతన అసమానతలు ప్రకారం ఆయా దేశాలకు ర్యాంకులు కూడా కేటాయించారు. కొన్ని దేశాలలో కాలానికి, ఆర్థిక పరిస్థితికి తేడా లేకుండా అసమానతలు ఉన్నాయని తేలింది. బాగా అభివృద్ధి చెందిన దేశాలలో కూడా దంపతుల మధ్య వేతన అసమానతలు ఉన్నాయని తేలింది. ఉత్తర ఐరోపా, అట్లాంటిక లో కూడా వేతన విషయంలో అసమానతలు ఉన్నాయని తేల్చారు. అయితే దీనికి కారణాలు మాత్రం మహిళలు కుటుంబాన్ని చేసుకోవడానికే 76.2 శాతం సమయాన్ని గడుపుతారని, పురుషులు ఉద్యోగాలలో సమయం గడుపుతారని వెల్లడైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: