దేశంలో పరిస్థితులు రానురాను సాంప్రదాయాలను మరిపించేస్తున్నాయి. ఎక్కడ కూడా అనుబంధాలకు ఆప్యాయతలకు ఆస్కారం లేకుండా పోతుంది. తప్పుడు దారులలో పోవాలనే ఆలోచనలు పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న ధరలు, పెరగని జీతాలు, అంతకంతకు బరమవుతున్న జీవితాలు మనిషిలో సహజంగానే ఉన్న సహనాన్ని పరీక్షిస్తున్నాయి. దీనితో మనిషి దాదాపుగా ఓడిపోతూనే ఉన్నాడు. క్షణికావేశంలో తప్పులు చేస్తూనే ఉన్నాడు. ఆ తప్పులకు పర్యవశానం మాత్రం ఆలోచించలేకపోతున్నాడు. అనేక విషయాలతో ఒత్తిడి పెరిగిపోతుండటంతో ఉన్నదానితో సరిపెట్టుకోవడం చేతకాకపోవడంతో హంగులు ఆశపడి కష్టాలు కొని తెచుకుంటూనే ఉన్నాడు.

ప్రపంచం భారతదేశంలో ఉన్న విలువలు చూసి ఆకర్షితులు అవుతుంటే ఇక్కడ వారు మాత్రం అవి అనుసరించడానికి ఇబ్బంది పడుతున్నారు. తమకోసమే పెద్దలు తీర్చిదిద్దిన నియమావళి అది అనే విచక్షణ లోపించడంతో జీవన విధానాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కడ చూసినా ఒంటరి కుటుంబాలు, పెద్దలు ఉండరు, ఉన్ననివ్వరు. అక్కడ సమస్య వస్తే పరిష్కారం చేసేవారు, లేదా సర్దిచెప్పేవారు లేకపోవడంతో ఉన్న ఇద్దరు కూడా చెరో దారి చూసుకుంటున్నారు. విద్య ఉన్నవారు, లేని వారు ఇద్దరు ఇందులో సమానంగానే ఆలోచిస్తుండటం విశేషం. మానవ సంబంధాలు ఇలా ఒత్తిడి తో మసిబారిపోతున్నాయి. ఎవరి జీవితం వారిదే అన్నట్టు బ్రతికేస్తున్నారు.

అయితే ఇవన్నీ ధైర్యంగా నిర్ణయం తీసుకోలేని వారు పడుతున్నారు, సహనం ఉన్నంతవరకు భరిస్తున్నారు, చివరకు ఒకరోజు ఆవేశం కట్టలు తెంచుకొని తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారు. అది వాళ్ళ జీవితాలను సమూలంగా మార్చేస్తుంది. ఈ మార్పు తరువాత వారికి మరో జీవితం ఉంటుందా లేదా అనేది కూడా చెప్పలేము. తాజాగా బార్యాభర్తల మధ్య సమాజంలో ఈ తరహా వివాదాలు చూస్తూనే ఉన్నాం. అయితే హత్యలు, లేదా విపరీతంగా ప్రవర్తించడం లాంటివి చేస్తున్నారు. ఇవన్నీ వారిలో ఆ క్షణం విచక్షణ లోపాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. తాజాగా ఏలూరులో ఇదే తరహాలో భార్య వేడినీళ్లు తెచ్చి నిద్రిస్తున్న భర్తపై పోసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియనప్పటికీ సందర్భం బట్టి చూస్తే ఆమెలో సహనం చనిపోయి, తీవ్రంగా ప్రవర్తించినట్టే తెలుస్తుంది. ఇక తరువాతి పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించడం కష్టమే. భర్త పరిస్థితి మాత్రం శరీరం అంతా వేడినీళ్లు పడేసరికి విషయంగానే ఉంది. క్షణికావేశంలో రెండు కుటుంబాలు, కనీసం మూడు తరాలు ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తుంచుకోవడం మానసికంగా చాలా సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: