ఈమధ్య దేశంలోని యువత ఎక్కువగా సిగరెట్టు మద్యపానం వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటున్నారు ఈల తీసుకోవడం వల్ల వారి ప్రాణాలకే ప్రమాదము. ఇక ఎక్కడ చేసిన ధూమపానం నిషేధం అంటూ కొన్నిసార్లు యాడ్స్ కూడా వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు కొంతమంది నివేదిక తెలిపిన ప్రకారం బీడీ,సిగరెట్ వంటివి మానేస్తే జరిగినటువంటి కొన్ని పరిణామాలు వెల్లడించారు. వాటి వివరాలను చూద్దాం.

ఎక్కువగా ధూమపానం తాగడం వలన వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ అలవాటు ఉన్నవారు విడిచి పెట్టడం అంత సులువైన పని కాదు. ఈ అలవాటు నుంచి వారు వదులుకోవడమే పెద్ద సవాలుగా మారుతుంది. ఒకవేళ వారు మాన వేసినట్లు అయితే.. వారు అధిక బరువును పెరిగే అవకాశం ఉంటుంది. అందుచేతనే వారు బరువు పెరగకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

1).ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను భుజించడం వల్ల తొందరగా కడుపునిండినట్లు అనిపిస్తుంది.

2). మనం తినే ఆహారంలో కొవ్వు పదార్ధాలు, చక్కెర స్థాయిలు తక్కువగా ఉండే వాటిని తీసుకోవాలి.

3). ఈ నికోటిన్ మానేసిన తరువాత శరీరంలో ఉండే కేలరీలు బర్న్ కావడం వల్ల బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది.

4). రోజులో కనీసం నాలుగు సార్లు అయినా ఏదో ఒకటి తింటూ ఉండాలి. లేదంటే ఎక్కువ ఆకలి వేయడం వల్ల అధిక ఆహారాన్ని భుజించడం వల్ల బరువు పెరుగుతారు.

5). స్మోకింగ్ మానేసిన వారు బరువు తగ్గడానికి ముఖ్యంగా వారికి తగినంత నిద్ర చాలా అవసరం. అలా నిద్రపోకుండా ఉండేవారు అనారోగ్య సమస్యలు వారిని చుట్టుముడతాయి. అంతేకాకుండా చాలా విసుగు చెందడం, కోపం వంటివి ఎక్కువగా వస్తాయి.

అందుచేతనే ధూమపానం వంటివి మానేసే టప్పుడు తగిన జాగ్రత్తలను పాటించాలి. లేదంటే రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుచేతనే ఎవరైనా చేయాలనుకునేవారు ఈ విషయాలను తెలుసుకోండి ప్రతి ఒక్కరూ ఒక్కసారి.

మరింత సమాచారం తెలుసుకోండి: