థైరాయిడ్ సమస్య అనేది ఎక్కువగా మహిళల్లోనే వస్తుంది అన్న విషయం చాలా మందికి తెలిసిన విషయమే. తాజాగా జరిపిన సర్వే ప్రకారం ప్రతి వంద మందిలో 50 మంది ఈ థైరాయిడ్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లే మహిళలలో ఈ తరహా సమస్య ఎక్కువగా ఉందని సర్వేలో రుజువైంది.. ఆఫీసు పనులు ఇటు ఇంటి పనులు ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేయడంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న మహిళలు ఎక్కువగా థైరాయిడ్ సమస్య బారిన పడుతున్నారు అట. థైరాయిడ్ సమస్య వస్తే బరువు పెరుగుతారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.


అంతేకాదు నెలసరి రావడం లో సమస్యలు, గర్భధారణ వంటి కారణాల వల్ల కూడా శరీరంలో హార్మోన్స్ బ్యాలెన్స్ అదుపుతప్పి ఫలితంగా థైరాయిడ్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ ఎందుకు వస్తుంది అంటే మనం తీసుకునే ఆహారంలో పోషక విలువలు తగ్గిపోవడం లేదా హార్మోన్లు సరిగా పనిచేయకపోవడం వల్ల థైరాయిడ్ సమస్య అనేది వస్తుంది.మన గొంతు భాగంలో శరీరానికి, తలకి మధ్య భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉండే ఈ గ్రంథి థైరాయిడ్ హార్మోన్లను స్రవించడం జరుగుతుంది.ఇక  ఈ హార్మోన్ శరీరంలోని ప్రతి కణంపై కూడా తన ప్రభావాన్ని చూపి,  ఎన్నో పనులు సవ్యంగా చక్కగా  జరిగేలా చేస్తుంది.


ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్ ల ఉత్పత్తి అటు ఎక్కువ,ఇటు తక్కువ కాకుండా తగినంత ఉండాలి
అలా జరగనప్పుడు దాని పనితీరులో  కూడా లోపాల రావడం వల్ల  అనేక సమస్యలు  చుట్టుముడతాయి.అంతేకాదు ఎవరైతే  థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు  బరువు పెరుగే అవకాశం కూడాఉంటుంది. ఒకవేళ థైరాయిడ్ ఎక్కువగా హార్మోన్లను విడుదల చేస్తే హైపర్ థైరాయిడిజం అని, థైరాయిడ్ తక్కువగా హార్మోన్లను విడుదల చేస్తే దానిని హైపో థైరాయిడిజం  అంటారు. థైరాయిడ్ హార్మోన్లు శరీరంలోని అన్ని అవయవాలు సవ్యంగా పనిచేసేలా చేయడమే కాకుండా క్యాన్సర్ కణాలను కూడా నాశనం చేస్తుంది.. కాబట్టి మన శరీరంలో హార్మోన్ల సమతుల్యత ఉండేలా చూసుకోవాలి

మరింత సమాచారం తెలుసుకోండి: