కామాఖ్య దేవాలయం (గౌహతి)
గౌహతిలోని కామాఖ్య దేవి ఆలయం భారతదేశంలోని శక్తి పీఠాలలో ఒకటి. ఒక గుహ లోపల విగ్రహం ఉంది. ఇది పవిత్రమైనది అని అంటారు. ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుండి ప్రజలు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. నవరాత్రి కూడా ఇక్కడ చాలా ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈ సమయంలో ఆలయంలో భారీ రద్దీ కనిపిస్తుంది.

మాతా వైష్ణో దేవి ఆలయం (జమ్మూ & కాశ్మీర్)
జమ్మూ కాశ్మీర్‌లోని కత్రా జిల్లాలోని వైష్ణో దేవిని ఏడాది పొడవునా వేల మంది యాత్రికులు సందర్శిస్తారు. ఇది దేశంలోని 108 శక్తిపీఠాలలో ఒకటి. దేవత వైష్ణో దేవిని దుర్గామాత రూపంగా నమ్ముతారు. ఆలయ పవిత్ర గుహ లోపల శిలల రూపంలో కన్పిస్తుంది అమ్మవారు. భక్తులు సాధారణంగా కాట్రా నుండి 13 కి.మీ.ల పాదయాత్రను అధిరోహించి దేవాలయ గర్భగుడిలోకి ప్రవేశించడానికి సుదీర్ఘ క్యూలలో నిలబడతారు.

మహాకాళి దేవి ఆలయం (ఉజ్జయిని)
మహాకాళి దేవి ఆలయం మధ్యప్రదేశ్‌లోని క్షిప్రా నది ఒడ్డున ఉన్న పురాతన నగరం ఉజ్జయినిలోని ఒక చిన్న కొండపై ఉంది. హిందూ పురాణాల ప్రకారం సతీదేవి పై పెదవి ఈ ఆలయం ఉన్న నేలపై పడింది. గ్రహ కాళిక, మహాలక్ష్మి మరియు సరస్వతి ఇక్కడ పూజించే ఇతర దేవత రూపాలు.

కోల్‌కతాలోని కాలిఘాట్ దేవాలయం (పశ్చిమ బెంగాల్)
కోల్‌కతాలోని ఈ ఆలయంలో దుర్గా పూజను నవరాత్రి సమయంలో ఘనంగా జరుపుకుంటారు. సతీదేవి కుడి పాదం బొటనవేలు ఈ ఆలయం ఉన్న చోట పడిపోయిందనేది ప్రజల విశ్వాసం.కాలిఘాట్ దేవాలయం ఏప్రిల్, అక్టోబర్ (నవరాత్రి) నెలల్లో వేలాది మంది భక్తులతో రద్దీగా ఉంటుంది. ఈ ప్రధాన దేవాలయం 2000 సంవత్సరాల కంటే పాతది. ఇది ఆది గంగా అనే చిన్న నీటి ఒడ్డున ఉంది.

మైసూర్ (కర్ణాటక) లోని చాముండేశ్వరి దేవాలయం
ఇది మైసూర్‌లోని చాముండి కొండల పైన ఉంది. సతి వెంట్రుకలు ఇక్కడ పడ్డాయని చెబుతారు. 12 వ శతాబ్దంలో హొయసల పాలకులు దేవత పేరు మీద ఆలయాన్ని నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: