ఈ మ‌ధ్య కాలంలో కేక్ ను స‌ర్వ సాధార‌ణంగా వాడుతున్నం. పుట్టిన రోజుకు, పెళ్లి రోజుకు, ఎంగేజ్ మెంట్ కు, పెళ్లి కి, ల‌వ‌ర్స్ డే, న్యూ ఇయ‌ర్ ఇలా చాలా వ‌రకు శుభ‌కార్య‌ల‌లో కేక్ ను వాడుతున్నం. వేడుక ఎది అయినా కేక్ ఉండాల్సిందే అలా సంబురాలు జ‌రుపుకుంటున్నారు. అలాగే కొంత మంది స‌ర‌దా కు కూడా కేక్ ముక్క‌ల‌ను కొని తింటారు. వీటి తో గెలుపు సంబురాలు, ప‌రీక్ష పోటీల్లో ఫ‌స్ట్ రావ‌టం వంటి వాటిల్లో నూ కేక్ ను విరి విరిగా వాడుతున్నారు. దీంతో కేక్ ల కు కూడా చాలా డిమాండ్ పెరిగింది. ఇప్ప‌టి వ‌రకు అనేక ర‌కాల కేక్ లు మార్కెట్ లో ల‌భిస్తున్నాయి. చాక్ లేట్, మ్యాంగో, పైనాపిల్ తో పాటు చాలా ర‌కాల ఫ్లేవ‌ర్ లు మ‌నకు ల‌భిస్తున్నాయి.



అయితే కేక్ ల‌కు పెరుగుత‌న్న డిమాండ్ దృష్ట్య అనేక ర‌క‌మైన కేక్ లు కూడా వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం పినాటా కేక్ ల హావా ఈ రోజుల్లో న‌డుస్తుంది. వీటినే  స్మాష్ కేక్ లు అని కూడా అంటున్నారు. వీటి ని క‌త్తి కోయ‌డం వంటి వి ఉండ‌వు. ఒక చిన్న పాటి సుత్తి తో కొట్ట‌డ‌మే. దీంతో అది ప‌గులు తుంది. దీంతో అందులో ఉన్న బ‌హుమ‌తులు బ‌య‌ట‌కు వ‌స్తాయి. ఇప్పుడు ఇలాంటి కేక్ లను ఎక్కువ గా వాడుతున్నారు. ఇలాంటి కేక్ లు స్నేహితుల ముందు పెట్టి ప‌గ‌ల గొట్టు మ‌ని వారిని ఆశ్చ‌ర్య ప‌రుస్తు గిఫ్ట్ ల‌ను ఇస్తున్నారు. అయితే ఈ కేక్ పై పొర చాక్ లేట్ తో ఉంటుంది. లోప‌ల గోల్డ్, ఫోన్, మ‌నీ ఇలా కొన్ని బ‌హుమ‌తుల‌ను పెట్ట‌వ‌చ్చు. దీంతో చాలా మంది ఇలాంటి కేక్ ల‌కే ప్రాధ‌న్య‌త ఇచ్చి త‌మ స్నేహితుల‌ను ఆశ్చ‌ర్య ప‌రుస్తున్నారు. ముందుగా సేల‌బ్రేటీలు ఇలాంటి కేక్ లు వాడే వారు. కానీ ప్ర‌స్తుతం అంద‌రూ కూడా ఇలాంటి కేక్ ల‌కే ప్రాధ‌న్య‌త ఇస్తున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: