ఎవరైనా సరే మన ఇంటికి వస్తే ముందుగా మన ఇంట్లో ఉన్న బాత్రూమ్ ని ముందుగా చూస్తూ ఉంటారు.. ఎందుకంటే మన బాత్రూం ఎంత శుభ్రంగా ఉంటే చూసేవారికి అంత మంచి పాజిటివ్ నెస్ కలుగుతుందట. అందుకే చాలామంది ఫ్యాషన్ కారణంగా లేదా ఇతరులను అనుకరించటం వల్ల.. మనకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము. ఇటీవల కాలంలో చాలా మంది బాత్రూం అందంగా కనిపించడం కోసం బాత్రూం లో ఏ వస్తువులు పడితే వాటిని పెట్టేస్తూ ఉంటారు.. ఉదాహరణకు ఇవి బాత్రూంలో పెట్టాల్సిన వస్తువులు కాదు.. కానీ ఎక్కడ పెట్టాలో తెలియక లేదా మరిచిపోయి ఒక్కోసారి మాత్రం బాత్ రూమ్ లో పెడుతూ ఉంటారు. అలాంటి వాటిలో పుస్తకాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మేకప్ ఐటమ్స్, మందులు లాంటివి పెడుతూ ఉంటారు..

నిపుణుల అభిప్రాయం ప్రకారం ..చూసుకుంటే కొన్ని వస్తువులు ముఖ్యంగా బాత్రూంలో వుంచకూడదట ఎందుకంటే వాటిని బాత్రూం లో ఉంచడం వల్ల త్వరగా పాడైపోయే అవకాశాలు ఉంటాయి.. అంతే కాదు మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మనం చెప్పుకుంటూ పోతే.. చాలా మందికి బాత్రూములో పాటలు పాడడం లేదా వినడం ఇలాంటి అలవాటు ఉంటుంది..ఈ అలవాటు కారణంగా వారు ఒకసారి రేడియో లేదా ఐపాడ్ వంటివి బాత్రూంలోని పెట్టుకుంటారు.. ఎలక్ట్రానిక్ ఐటమ్స్  బాత్రూం లో ఉంచడం వల్ల తేమ శాతానికి అవి చెడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది..

మరికొంతమందికి బాత్రూంలో మ్యాగజైన్స్ లేదా బుక్స్ లాంటివి చదవడం అలవాటు గా ఉంటుంది. అందుకోసమే వీరు ప్రతి సారి బాత్రూమ్ కి వెళ్ళినప్పుడు పుస్తకాలు తీసుకెళ్ల లేక అక్కడే పెట్టుకుంటూ ఉంటారు.. బాత్రూం లో పుస్తకాలు పెట్టడం వల్ల అవి తేమను గ్రహించి త్వరగా పాడైపోతాయి.అంతేకాదు పుస్తకాలలో బ్యాక్టీరియా కూడా ఎక్కువగా పెరిగి,మనకు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.

ఇక మేకప్ వస్తువులు కూడా పెట్టుకోవడం వల్ల ఈ ఉత్పత్తులు తేమను గ్రహించి, ఖరీదైన మేకప్ వస్తువులు కూడా పాడైపోయే ప్రమాదం ఉంది.. మీరు కనుక ఇలాంటి వస్తువులు మీ బాత్రూమ్లో పెట్టుకుంటా ఉన్నట్లయితే వెంటనే తొలగించండి..

మరింత సమాచారం తెలుసుకోండి: