ఆరోగ్యం బాగుండాలి అంటే శరీరంలో అన్ని అవయవాలు పని చేయాలి.. అవయవాలు సరిగ్గా పని చేయాలంటే, వాటికి సరైన శక్తి , ప్రోటీన్స్ ,విటమిన్స్ లభించాలి.. మనం తీసుకునే ఆహారంలో విటమిన్స్ లోపం అయితే ఎలాంటి నష్టాలు కలుగుతాయో కూడా చాలామందికి తెలిసిన విషయమే.. మన శరీరానికి విటమిన్ సి ఎంత ప్రాధాన్యమో ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి.. ఎందుకంటే విటమిన్ సి మన శరీరానికి ఎంత ఎక్కువగా లభిస్తే.. అంత ఎక్కువగా మనకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. అయితే విటమిన్ సి లోపం ఉన్నట్లు మనం ఎలా తెలుసుకోవాలి.. మనలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా రోజువారి ఆహారంలో మనం ప్రతిరోజు 75 మిల్లీగ్రాముల విటమిన్ సి తీసుకోవాలి.. అంటే ఆడవాళ్లు  తీసుకునే ఆహారంలో 75 మిల్లీ గ్రాములు విటమిన్-సి ఉండేలాగా చూసుకోవాలి. అదే పురుషులు అయితే వారు తీసుకునే ఆహారంలో 90 మిల్లీగ్రాముల విటమిన్ సి తీసుకోవాలి..

ఇక విటమిన్ సి లోపం వల్ల మనకు కలిగే లక్షణాలు ఏమిటంటే దంతక్షయం, అలసట, కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తాయి. అంతేకాదు మరికొన్ని వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.. విటమిన్-సి లోపం వల్ల కలిగే వ్యాధులు ఏంటో ఒకసారి చదివి తెలుసుకుందాం..

1. స్కర్వి:
ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అని చెప్పవచ్చు ఎందుకంటే మన శరీరంలో ఎప్పుడైతే విటమిన్ సి లోపం కలుగుతుందో అప్పుడు మనకు ఈ వ్యాధి సంభవిస్తుంది. ఇది ఏర్పడినప్పుడు చిగుళ్ళ నుండి రక్తస్రావం, గాయాలు, దద్దుర్లు, అలసట, బలహీనత, ఆకలి వేయకపోవడం, కీళ్లనొప్పులు , చిరాకు వంటి సమస్యలు ఎదురవుతాయి.. సరైన సమయంలో చికిత్స అందకపోతే రక్తహీనత, చిగుర్లు వాపు , చర్మపు రక్తస్రావం వంటి సమస్యలకు కూడా దారితీయవచ్చు..

దీనితోపాటు హైపర్ థైరాయిడిజం, ఎనీమియా, రక్తస్రావం చర్మ వ్యాధులు వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది..

విటమిన్ సీ లోపాన్ని నివారించాలంటే.. మనం ముఖ్యంగా సిట్రస్ జాతి పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.. నారింజ , బత్తాయి, నిమ్మ పండు లాంటి సిట్రస్ జాతి పండ్లు తినడం వల్ల శరీరంలో విటమిన్ సి బ్యాలెన్స్ గా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: