అప్పట్లో అయితే మలవిసర్జన చేయడానికి చాలామంది బయటకు వెళ్ళేవాళ్ళు.. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఇళ్ల నిర్మాణం జరుగుతుంది.. కాబట్టి పరిశుభ్రత పాటించాలి.. అని ప్రతి ఒక్కరు మరుగుదొడ్లు నిర్మించుకొని , వాటిని ఉపయోగిస్తున్నారు. ఇకపోతే టెక్నాలజీ మారుతున్న కొద్దీ ప్రతి ఒక్కరు ఇంటి లోపలి బాత్రూంలను ఏర్పాటు చేసుకోవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఈ బాత్రూమ్ లను ఉపయోగించిన తర్వాత క్లీన్ చేయాలంటే చాలామంది అసహ్యంగా ఫీలవుతూ ఉంటారు.. అయితే ఈ బాత్రూం నిత్య దినచర్య లో ఉపయోగించడం వల్ల రోజువారీ పనులతో బాత్ రూమ్ చాలా డర్టీ గా మారిపోతుంది.. అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని టిప్స్ పాటించి, బాత్రూమ్ ఎప్పుడూ శుభ్రంగా మెరుస్తూ ఉండేలా చేసుకోవచ్చు..

మీరు ప్రతిరోజు ఉదయం అలాగే సాయంత్రం పూట ఉపయోగించిన తర్వాత హ్యాండ్ సింక్ ను తుడవడం మంచిది.. ఇందుకోసం మీరు డాట్ గ్లోజ్ ను ఉపయోగిస్తే సరిపోతుంది. అయితే వీటిని మీరు మీ బాత్ రూమ్ లోనే పెట్టుకోవడం వలన రోజుకు రెండు సార్లు ఈజీగా శుభ్రం  చేయడానికి వీలు ఉంటుంది.. అయితే కొంచెం ఇబ్బంది అనిపించినా.. తర్వాత తర్వాత బాత్రూం శుభ్రంగా ఉండడం చూసి మీకే శ్రద్ధ వస్తుంది.

మీరు స్నానం చేసేటప్పుడు షవర్ ను ఉపయోగిస్తారు కాబట్టి ప్రతిసారి బాత్రూము శుభ్రం చేసుకోవడం మంచిది. ఎందుకంటే స్నానం చేసిన వెంటనే గోడలపై షాంపూ ,సబ్బు మరకలు ఉంటాయి.. కాబట్టి తడిసిన గోడలను తుడవడం చాలా సులభం.

బాత్రూమ్ డోరు కింది వైపు అలాగే ముఖ్యంగా లోపల వైపు కూడా శుభ్రం చేసుకోవాలి.. వెనుక చూడ్డానికి అపరిశుభ్రంగా ఉంటుంది కాబట్టి, వారానికి ఒక సారి శుభ్రం చేసినా చాలు మెరుస్తూ ఉంటుంది.

ఇక టాయిలెట్ ను ఉపయోగించిన ప్రతిసారి తప్పకుండా శుభ్రం చేసుకోవాలి..లేదంటే టాయిలెట్ నుంచి వచ్చే దుర్వాసన ను తట్టుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రతిసారి క్లీన్ చేసుకోవడం ఉత్తమం.. అంతేకాకుండా మార్కెట్లో దొరికే సువాసన భరితమైన జెల్ ప్యాకెట్స్ తెచ్చుకొని బాత్రూంలో పెట్టుకోవడం వల్ల కూడా మంచి సువాసన వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: