భారతదేశం శాంతికి పునాదిగా ఉన్నదని తెలిసిందే. అయితే అదే తప్పు అన్నట్టుగా కొందరు దాని వెంట శత్రువులుగా పడుతుండటం కూడా చూస్తూనే ఉన్నాం. అయితే మరో రకం వారు కూడా భారత్ వెనుక శత్రువులుగా ఉంటూ, వెన్నుపోటు పొడిచేందుకు, దొంగ దెబ్బ తీసేందుకు సిద్ధంగా ఉన్నారు. వారందరి విషయానికి వస్తే, భారత్ ఎప్పుడైనా ప్రపంచాన్ని పాలిస్తుంది, ఏలుతుంది అనేది వాళ్లకు భారత్ పట్ల ఉన్న అభిప్రాయం. కానీ నిజానికి అలాంటి ఆలోచన భారత్ కు ఉన్నదా లేదా అనేది మాత్రం ఈ రెండు వర్గాలు పట్టించుకోవడం లేదు. అసలు దారిలో ఉన్నది పామో తాడో తెలిస్తే తరువాత ఏమి చేయాలో పరిష్కారం ఆలోచించాలి కానీ ముందే పాము అనుకుని పరిష్కారం చూసుకుంటే అది వారి తప్పుడు నిర్ణయమే అవుతుంది. భారత్ విషయంలో కూడా ప్రపంచ దేశాలలో ఎక్కువ శాతం ఇలాంటి తప్పుడు ఆలోచనతోనే ఉన్నారు.

నిజంగా విశ్వానికి సంబంధించి భారత్ కు ఉన్న లక్ష్యాలు ఏమిటి అనేది వీళ్ళందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారత్ ను పరిశీలిస్తే అవి తేలికగా తెలిసిపోతుంది కదా. అంటే వాళ్లకు ఆ మాత్రం సంయమనంతో ఆలోచించే అలవాటు ఉంటె భారత్ లాంటి దేశాలను శత్రుదేశంగా ఎలా చూడగలుగుతారు. అసలు అయితే భారతదేశానికి ప్రపంచంతో ఉన్న లక్ష్యం, స్నేహాన్ని, సౌబ్రాతృత్వాన్ని, సహనాన్ని ప్రపంచంలో ఉన్న ప్రజలకు అలవరచడం ద్వారా లేదా పంచడం ద్వారా సుస్థిరమైన శాంతిని స్థాపించడం. అప్పుడు మనిషి, మనిషిగా ఉంటాడు. ఆ,అలాంటి మనిషిలో నిండైన మానవత్వం ఉంటుంది. తద్వారా ఎదుటివారికి వీలైనంత సాయం చేస్తూ, అలాగే ఎదుటివారి మేలు కోరుకుంటూ ఉన్నతంగా బ్రతుకుతాడు. అది ఉన్నతమైన జీవితం అంటే, బోలెడంత డబ్బు ఉండటం కాదు. ఇలాంటివి లోకానికి పరిచయం చేస్తూ, ప్రపంచంలో ఉన్న అసమానతలు తగ్గిస్తూ, అందరికి జీవించే స్వేచ్ఛను ఇస్తూ శాంతి వైపు స్థిరమైన అడుగులు వేయడం, వేస్తుండటం, వేయించడం భారత్ కు విశ్వవ్యాప్తంగా ఉన్న ఏకైన లక్ష్యం.

అంతేగాని, ప్రపంచాన్ని ఏలాలని, అందరిని తన కాళ్లదగ్గరకు తెచ్చుకోవాలని.. లాంటి చచ్చు కోరికలు భారత్ మనసులో కూడా ఉద్బవించబోవని ప్రపంచం అర్ధం చేసుకోవాలి. అప్పుడే ఈ మారణ కాండలు ఆగుతాయి. మన కళ్ళముందే మృత్యువుకు దగ్గరవుతున్న వాడిని చూసి ఏమి చేయలేని స్థితికి వస్తే దానిలోంచి మానవత్వం రాదు, అలాంటి స్థితి రాకుండా ప్రతివారినీ స్నేహంతో, ప్రేమతో దగ్గరకు తీసుకోవడమే భారతీయ తత్త్వం. దానిలో ఇసుమంత కూడా తేడా రాదు. ఇది ప్రపంచ దేశాలు తెలుసుకుంటే భారత్ పై ఏడ్చి చచ్చే చాలా మంది వెనక్కి తగ్గుతారు, తద్వారా వచ్చే ఎంతో వినాశనం ఆగిపోతుంది. లోకాస్సమస్తా సుఖినోభవంతు. ఓం శాంతి శాంతి శాంతిః

మరింత సమాచారం తెలుసుకోండి: