ఏదైనా పెళ్లిళ్లు జరిగినా.. ఫంక్షన్ లు జరిగినా..చిన్నపిల్లల మొదలుకొని మహిళల వరకు ప్రతి ఒక్కరు ఎంతో అందంగా రెడీ అవుతూ ఉంటారు.. అంతే కాదు నలుగురిలో చాలా భిన్నంగా కనిపించాలని రకరకాల ఆభరణాలు, దుస్తులు వేసుకుంటూ ఉంటారు.. ఎన్ని ఆభరణాలు ధరించినా.. పట్టు వస్త్రాలు వేసుకున్నప్పటికీ ఏదో ఒక వెలితి కనిపిస్తూనే ఉంటుంది.. అంటే మన నుదిటిన పాపిడిబిళ్ళ లేకపోతే ఏదో వెలితి గానే కనిపిస్తుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.. ఎటువంటి ఆభరణాలు ధరించకపోయినా ఒక్క పాపిట బిళ్ళ ధరిస్తే చాలు అమ్మాయి అందం రెట్టింపు అవుతుంది..


పాపిట బిళ్ళ:
పేరుకు తగ్గట్టుగానే పాపిట మధ్యలో ఈ పాపిట బిళ్ళను ధరిస్తూ ఉంటారు. అయితే ఈ పాపిట బిళ్ళను ధరించడం వల్ల అమ్మాయికి దిష్టి తగలకుండా ఉంటుంది అని పెద్దల విశ్వాసం. అందుకే  చాలా అందంగా ముస్తాబైన అమ్మాయికి ఈ పాపిట బిళ్ళను తప్పకుండా ధరిస్తారు.

వడ్డానం:
వడ్డానం అనేది నడుముకు పెట్టుకునే ఆభరణం. అప్పట్లో చాలామంది వడ్డానాన్ని  పెట్టుకోవడం వల్ల చాలా మోటుగా ఉందని భావించేవాళ్లు ..కానీ ప్రస్తుతం ఇదే ట్రెండ్ నడుస్తోంది కాబట్టి ప్రతి ఒక్కరు దీనిని ధరించడానికి ఇష్టపడుతున్నారు.. అంతే కాదు డబ్బు ఉన్న వాళ్ళు అయితే ఏకంగా బంగారుతో చేయించిన వడ్డానాన్ని ధరిస్తున్నారు.

గాజులు:
ఎన్ని ఆభరణాలు ధరించినా చేతికి గాజులు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. మధ్యలో  బంగారు గాజులు వేసుకొని అటు ఇటు మట్టి గాజులు వేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం కూడా సొంతం చేసుకోవచ్చు.

జుంకాలు:
ప్రస్తుతం మార్కెట్లో రకరకాల డిజైన్లలో మనకు ఈ జుంకాలు లభ్యమవుతున్నాయి.. కాబట్టి మీ అందానికి తగ్గట్టు జుంకాలను మీరు సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవడం వల్ల ఏ ఫంక్షన్ లో నైనా సరే మీరే అట్రాక్టివ్ గా కనిపిస్తారు.అందుచేతనే వీటన్నిటిని ఎక్కువగా మనం ధరిస్తూ ఉంటాము.ఎన్ని ఆభరణాలు ధరించినా పాపిట బిళ్ళను ధరించడం మాత్రం మర్చిపోకండి.

మరింత సమాచారం తెలుసుకోండి: