మన గ్రహం అద్భుతాలు, అందమైన ప్రదేశాలతో నిండి ఉంది. ఇప్పటికీ ప్రపంచంలోని చాలా ప్రదేశాలు అద్భుతాలుగా నిలిచాయి. పెద్ద, చిన్న అనే తేడా లేకుండా చాల దేశాలు అద్భుతంగా ఉంటాయి. అయితే ఒక చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో ఉన్న కొన్ని చిన్న దేశాలు ఇప్పటికీ పరిపూర్ణమైన ప్రభుత్వాన్ని, సంస్కృతిని, సంప్రదాయాలను కలిగి ఉన్నాయన్న వాస్తవం మీలో ఎంతమందికి తెలుసు ?
ప్రపంచంలోని కొన్ని చిన్న దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వాటికన్ సిటీ (0.44 చ.కి.మీ)
ఈ జాబితాలో అగ్రస్థానంలో అందమైన వాటికన్ సిటీ ఉంది. ఇది ప్రపంచంలోనే అతి చిన్న దేశం. కేవలం 110 ఎకరాల భూమిలో విస్తరించి ఉన్న ఈ దేశ జనాభా కేవలం 1000 మాత్రమే. కానీ ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన నగరంగా ఈ దేశం ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశం చారిత్రాత్మకంగా మైఖేలాంజెలో, లియోనార్డో డా విన్సీతో సహా ప్రపంచంలోని గొప్ప కళాకారులతో ముడిపడి ఉంది.
ఆసక్తికరమైన ప్రదేశాలు : సెయింట్ పీటర్స్ బసిలికా, సెయింట్ పీటర్స్ స్క్వేర్, వాటికన్ మ్యూజియంలు

మొనాకో (2 చదరపు కి.మీ.)
ప్రపంచంలోని రెండవ అతి చిన్న దేశమైన మొనాకో కేవలం 499 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. కానీ ఈ చిన్న దేశం మాటల్లో చెప్పలేనంత గొప్పది. మీరు ఈ దేశ సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు. కానీ దేశం మోంటే కార్లో క్యాసినో, గ్రాండ్ ప్రిక్స్ మోటార్ రేసింగ్ ఈవెంట్‌లకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
ఆసక్తికరమైన ప్రదేశాలు : మోంటే కార్లో క్యాసినో, మొనాకో కేథడ్రల్, మొనాకో ఓషనోగ్రాఫిక్ మ్యూజియం, పురాతన ఆటోమొబైల్ మ్యూజియం

నౌరు (21 చ.కి.మీ)
జాబితాలో మూడవ స్థానంలో ఉన్న నౌరు గతంలో ఆహ్లాదకరమైన ద్వీపం. ఆస్ట్రేలియా తూర్పున ఉన్న  ఈ దేశంలోని ప్రస్తుత జనాభా సుమారు 13000 మంది. ఈ శాంతియుత దేశం చాలా మంది పర్యాటకుల దృష్టికి దూరంగా ఉంది.
ఆసక్తికరమైన ప్రదేశాలు : అనిబారే బే, సెంట్రల్ పీఠభూమి, జపనీస్ గన్స్, మొక్వా వెలో

తువాలు (25.9 చ.కి.మీ)
ఈ అద్భుతమైన దేశం ఓషియానియా, తువాలు పాలినేషియా ప్రపంచంలోని నాల్గవ అతి చిన్న దేశం. గతంలో ఎల్లిస్ ఐలాండ్ అని పిలిచేవారు. ఈ ద్వీప దేశంలో సుమారు 11,000 మంది జనాభా ఉంటారు. దాని రిమోట్‌నెస్ కారణంగా ఈ దేశం పర్యాటక జాబితా నుండి దూరంగా ఉంది. కానీ ఇది ఒక ప్రసిద్ధ ఆఫ్‌బీట్ డెస్టినేషన్.
ఆసక్తికరమైన ప్రదేశాలు : ఫునాఫుటి మెరైన్ కన్జర్వేటివ్ ఏరియా, తువాలు స్టాంప్ బ్యూరో

శాన్ మారినో (61.2 చ.కి.మీ)
శాన్ మారినో 61.2 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఐదవ స్థానంలో ఉంది. దేశ జనాభా సుమారు 33000 మంది. శాన్ మారినో ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా ఆర్థిక, పరిశ్రమ, సేవలు, పర్యాటక రంగాలపై ఆధారపడి ఉంటుంది. ఈ అందమైన దేశం ప్రధాన ఆకర్షణలు దాని క్లిఫ్-టాప్ ప్యాలెస్‌లు అద్భుతంగా కనిపిస్తాయి.
ఆసక్తికరమైన ప్రదేశాలు : గుట్టా టవర్, పియాజ్జా డెల్లా లిబెర్టా, మౌంట్ టైటాన్, పాలాజ్జో పబ్లికో

మరింత సమాచారం తెలుసుకోండి: