భయానక హాంటెడ్ ప్రాంతాల గురించి చాలా వింటాము. చూడాలనే కుతూహలం కూడా ఉంటుంది. కానీ భయం ఆ ఆసక్తిని వెనక్కి లాగుతుంది. కానీ కొంతమంది మాత్రం ధైర్యం చేసి ముందడుగు వేస్తారు. ఆశ్చర్యపరిచే భయానక కథనాలతో ప్రపంచంలోని అత్యంత హాంటెడ్ ప్రదేశాలలో కొన్ని మీకోసం.

భాంగర్ కోట, భారతదేశం
రాజస్థాన్‌లోని ఈ శిధిలమైన నగరం భారతదేశంలోని అత్యంత హాంటెడ్ ప్రదేశాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ఇది చాలా వరకు శిథిలావస్థలో ఉన్నప్పటికీ, ఈ కోట అనేక భయానక కథలకు నిలయంగా ఉంది. సందర్శకులు ఈ ప్రదేశంలోకి ప్రవేశించడానికి అనుమతి ఉంటుంది. కానీ సూర్యాస్తమయం తర్వాత ఎవరినీ లోపలికి అనుమతించరు. ఈ ప్రదేశంలో అనేక అతీంద్రియ కార్యకలాపాలు జరుగుతాయి. ఇప్పటికీ చాలా మంది ప్రజలు పారానార్మల్ అనుభవం కోసం ఈ ప్రదేశానికి వస్తుంటారు.

పోవెగ్లియా ద్వీపం, ఇటలీ
పోవెగ్లియా అనే అందమైన ద్వీపం ఒకప్పుడు ప్లేగు బాధితులకు క్వారంటైన్ జోన్‌గా దీన్ని చేశారు. 20వ శతాబ్దం ప్రారంభంలో ఈ ద్వీపాన్ని ఆక్సిలేమ్‌గా కూడా ఉపయోగించారు. ఈ ప్రదేశం పారానార్మల్ కార్యకలాపాలకు కేంద్రంగా ఉందని, దెయ్యాల వేటగాళ్లు పేర్కొన్నందున ఈ ద్వీపానికి ప్రయాణం ప్రస్తుతం నిషేధం.

పోర్ట్ ఆర్థర్, ఆస్ట్రేలియా
దెయ్యాలను చూడాలనే ఆసక్తి ఉంటే ఈ ప్రదేశం మీ కోరికను నెరవేరుస్తుంది. పోర్ట్ ఆర్థర్ చుట్టూ అనేక దెయ్యాల పర్యటనలను చూడొచ్చు. ఇది 18వ శతాబ్దపు దోషులను శిక్షించే ప్రత్యేక ప్రాంతం. ఈ టాస్మానియన్ నగరం ఇప్పుడు పారానార్మల్ కార్యకలాపాలకు కేంద్రంగా మారింది.

ప్యాలెస్ ఆఫ్ గుడ్ హోప్, కేప్ టౌన్, సౌత్ ఆఫ్రికా
17వ శతాబ్దంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీచే నిర్మించిన కాజిల్ ఆఫ్ గుడ్ హోప్ దక్షిణాఫ్రికాలో అత్యంత పురాతనమైన భవనం.
లేడీ ఇన్ గ్రే అనే దెయ్యం తరచుగా ప్యాలెస్‌లో కంపించేదట. అంతేకాదు ఆమె భయానరంగా ఏడ్చేదట. బెల్ టవర్‌ వాటంతట అదే మోగడం, అనుమానాస్పద సందర్శకులను ఒక నల్ల కుక్క దెయ్యం తడుతుందని, ఆపై గాలిలో అదృశ్యమవుతుందని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: