స్వ‌లింగ సంప‌ర్కు లు పెళ్లిల్లు చేసు కోవ‌డం పాశ్చ‌త్య దేశాల్లో సాధార‌ణంగా జ‌రుగుతూ ఉంటుంది. అయితే మ‌న దేశం ఇలాంటి వివాహాలు చాలా అరుదు గా జ‌రుగుతాయి. అలాగే మ‌న తెలంగాణ రాష్ట్రం లో ఇలాంటి భిన్న మైన వివాహాం ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ర‌గ లేదు. అయితే ఇప్పుడు మ‌న రాష్ట్రంలో కూడా ఇలాంటి భిన్న మైన పెళ్లి త్వ‌ర‌లో నే జ‌ర‌గ‌బోతుంది. అవునండి.. మ‌న తెలంగాణ రాష్ట్రం లో ఇద్ద‌రు అబ్బాయి లు త్వ‌ర‌లో పెళ్లి చేసుకుని ఒక్క‌టి కాబోతున్నారు. నిజానికి మ‌న తెలుగు రాష్ట్రాల‌లో కూడా గ‌తం లో ఇలాంటి పెళ్లి లు కాలేవు. ఎక్క‌డో అమెరికా నో లేదా యూర‌ప్ దేశాల‌లో ఇలాంటి వివాహాలు అయితే పేప‌ర్, టీవీ ల‌ల్లో చూసే వాళ్లం. కాని ఇప్పుడు మ‌న రాష్ట్రంలో నే ఇలాంటి వివాహాం జ‌ర‌గ‌బోతుంది.



సుప్రియో, అభ‌య్ అనే యువ‌కులు హైద‌రాబాద్ న‌గ‌రంలో నివాసం ఉంటుంన్నారు. అయితే వీరు ఇరువురు కూడా స్వ లింగ సంప‌ర్కులే. వీరి ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం ఇక ఆన్ లైన్ డేటింగ్ యాప్ లో జ‌రిగింది. కొన్ని రోజుల పాటు మంచి స్నేహితులు గా ఉన్నారు. త‌ర్వాత వీరి మ‌ధ్య ఉన్న స్నేహం ప్రేమ గా మారింది. దాదాపు ఎన‌మిది సంవ‌త్స‌రాలుగా ఇద్ద‌రు  ప్రేమించు కున్నారు. త‌ర్వాత ఇద్ద‌రు పెళ్లి కూడా చేసుకుందామ‌ని అనుకున్నారు. ఇదే విష‌యాన్ని త‌మ త‌ల్లి దండ్రుల‌కు చెప్పార‌ట‌. అయితే వారి త‌ల్లి దండ్రులు మొద‌టి ఈ వివాహనికి అనుమ‌తి ఇవ్వ‌లేద‌ట‌. అయితే చాలా రోజుల త‌ర్వాత ఈ పెళ్లి అనుమతి ఇచ్చార‌ట‌. దీంతో వీరి పెళ్లి అన్ని సంప్రాదాయ‌లతో అంగ రంగ వైభవం గా చేసు కోవ‌డానికి ప్లాన్ వేస్తున్నారు. పెళ్లి చూపులు, మంగ‌ళ స్నానాలు వంటి సంప్రాదాయాలు కూడా ఈ పెళ్లి లో ఉంటాయ‌ని చెబుతున్నారు. అయితే ఈ పెళ్లి ఎలా జ‌రుగుతుందో చూడాలి మ‌రి.





మరింత సమాచారం తెలుసుకోండి: