సాధారణంగా పచ్చిమిరపకాయలను రెండు తెలుగు రాష్ట్రాలలో తినని వారంటూ ఎవరూ ఉండరు.. చూడడానికి పసుపుపచ్చ , ఆకుపచ్చ రంగులలో మనకు కనిపిస్తూ ఉంటాయి.. ఎవరైనా సరే కారంగా ఉండే మిర్చిని కొరకాలి అంటే తమ కళ్ళకు పని చెప్పాల్సిందే.. పచ్చిమిరపకాయ కు ఉండే సహజసిద్ధమైన గుణాల్లో ఘాటు కూడా ఒకటి.. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఘాటు ఫ్లేవర్లు వచ్చినప్పటికీ పచ్చిమిర్చి ఉన్న ఘాటు కి ఏ ఒక్కటి కూడా సరితూగ లేవు.. ఈ పచ్చిమిరపకాయలను మనం కూరలలో, ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆయుష్షు కూడా పెంపొందించుకోవచ్చు అని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

ముఖ్యంగా ఈ పచ్చి మిరపకాయలు తినడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయంపై కెనడా, యూఎస్, చైనా, ఇటలీ  వంటి దేశాలలో పరిశోధనలు కూడా జరిగాయి.. అంతే కాదు అందరి అభిప్రాయాలను సేకరించి, ఒక నివేదికను కూడా ఏర్పాటు చేశారు. పచ్చిమిరపకాయలను మనం తినడం వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువ. అంతేకాదు మిగతా వారితో పోల్చుకుంటే పచ్చిమిరపకాయ తినే వారిలో 26 శాతం గుండె సమస్యలు రావట.. 23శాతం క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.


తక్కువ కారం ఉండే మిరపకాయలను ఉపయోగించే వారి కంటే ఎక్కువ కారం ఉండే పచ్చిమిరపకాయలను ఉపయోగించే వారిలో ని ఎక్కువ ఆయుష్యు ఉంటుందని సమాచారం. మిరపకాయలలో విటమిన్ ఇ పుష్కలంగా లభించడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడంలో ఈ పచ్చిమిరపకాయలు కీలకపాత్ర పోషిస్తాయి.. కంటి సమస్యతో బాధపడుతున్న వారు తమ చూపును మెరుగు పరుచుకోవాలి అంటే తప్పకుండా పచ్చిమిరపకాయలను తమ ఆహారంలో భాగంగా చేర్చుకోవాలట. అంతేకాదు విటమిన్ ఏ తో పాటు విటమిన్ సి కూడా ఉండడం వల్ల శరీరంపై గాయాలు వేగంగా తగ్గుతాయి. పచ్చి మిరపకాయ లో ఉండే ఫ్లేవనాయిడ్స్ ఒత్తిడి, ఇతర పరిస్థితులను మనం ఎదుర్కోవడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు శరీరంలో ఉండే అధిక కొలెస్ట్రాల్ ని కూడా ఈ పచ్చిమిరపకాయలు తగ్గిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: