ఈ మధ్యకాలంలో ఎక్కువగా మగవారు, ఆడవారు ఎక్కువగా డేటింగ్ విషయంలోనే ముందంజలో ఉన్నారు. అయితే వివాహం కానంతవరకు ఏమీ కాదు. ఒకవేళ వివాహమైన వ్యక్తితో డేటింగ్ కి వెళితే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.


మొదట మీకు ఇష్టమైన వ్యక్తితో డేటింగ్ కి వెళ్ళినప్పుడు చాలా త్రిల్లింగ్ గా అనిపించవచ్చు. అదే వివాహమైన మగవారితో చేసినప్పటికీ అది రానురాను చాలా ప్రమాదంగా అంతే అవకాశం ఉంటుంది. తన లైఫ్ లో ఒక వ్యక్తి ఉన్నదని గుర్తుంచుకోవాలి. ఇలాంటి విషయంలో ముందుగా ఆడవారిని నిందిస్తారు. అయితే ఇలాంటి విషయాలను పట్టించుకోకుండా కొంత మంది మహిళలు వివాహమైన నా పురుషునితో డేటింగ్ చేస్తూ ఉంటారు.

 ఒకవేళ వివాహమైన పురుషునితో డేట్ చేస్తే.. మీతో ఉండే ప్రతి ఒక్కరికి అబద్ధాలు చెప్పకతప్పదు. అంతే కాకుండా ఈ విషయాలను మీ తోటి బంధువులకు చెప్పుకోలేరు. ఒకవేళ వారికి ఈ విషయం తెలిసినప్పటికీ వారి రియాక్షన్ ఎలా ఉంటుందో మనం ఊహించలేం.

వివాహమైన వ్యక్తితో డేటింగ్ చేస్తే.. మన ఇంటి చుట్టూ ఉన్న ప్రజలు మిమ్మల్ని కొంపలు కూల్చే వారు అని అంటారు. ఇక భార్యాభర్తల మధ్య గొడవ పెట్టడానికి వచ్చిన వ్యక్తి అని కూడా మిమ్మల్ని దూషిస్తారు.

దీంతో మీ బంధువులు, స్నేహితులు ఎవరూ మిమ్మల్ని దగ్గరికి చేరానివ్వరు. అంతే కాకుండా ఈ విషయాలను ఇతరులకు షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు మీ దగ్గర ఏ ఒక్కరు ఉండరు.

మీరు వివాహమైన పురుషునితో డేటింగ్ చేయవలసి వస్తే.. ఆ వ్యక్తిని మీరు ఏ సమయంలో పడితే ఆ సమయంలో కలవడానికి వీలు ఉండదు. అందుకు ముఖ్య కారణం తనకు ఒక ఫ్యామిలీ ఉన్నది కనుక. కేవలం ఏదైనా ప్రైవేట్ ప్లేస్ లోనే కలుసుకోవాలిసి ఉంటుంది.

ఇక మీ చుట్టు పరిసరాలలో ఉండే ప్రజలు మీ వ్యక్తిత్వం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవన్నీ మిమ్మల్ని చాలా బాధిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: