సాధారణంగా మనకు వంటింట్లో దొరికే ఎన్నో ఔషధాలలో దాల్చిన చెక్క కూడా ఒకటి. కేవలం మసాలా దినుసుగా మాత్రమే ఉపయోగపడడమే కాకుండా  ఎన్నో రకాలుగా ఆరోగ్య ప్రయోజనం గా కూడా మనకు ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు చెప్పినట్లుగా మీరు ఈ దాల్చిన చెక్క పొడిని ఉపయోగిస్తే,  అనారోగ్య సమస్యలు అన్ని దూరం అవుతాయి.


ముఖం పై దద్దుర్లు, మొటిమలు, కురుపులు వంటివి వచ్చినప్పుడు దాల్చినచెక్క చాలా చక్కగా పనిచేస్తుంది. ఇందుకోసం మూడు వంతుల తేనె తీసుకుని, అందులో దాల్చిన చెక్క పొడిని కలిపి మిశ్రమంలా చేసి మొటిమలపై అప్లై చేయాలి. ఒక ఇరవై నిమిషాల తర్వాత నీటితో కడిగి.. రెండు మూడు రోజులు ఇలా చేస్తే ఖచ్చితంగా సమస్యలు తగ్గిపోతాయి.


దాల్చిన చెక్క పొడిని నిమ్మరసం, పెరుగు తో కలిపి మెడ, ముఖం .. మెడ వెనుక భాగంలో రాసుకోవడం వల్ల మెడ మీద నలుపు తో పాటు ముఖం మీద జిడ్డు , మచ్చలు కూడా దూరమవుతాయి.దాల్చిన చెక్క పొడి  వల్ల ముడతలు కూడా రావట.


పొట్ట లో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తేనె, దాల్చిన చెక్క పొడి కలిపి కొద్దిగా తాగడం వల్ల పొట్ట మొత్తం శుభ్రం అవుతుంది.

కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారు రెండు టేబుల్ స్పూన్ల దాల్చిన చెక్క పొడి,  రెండు టేబుల్ స్పూన్ల తేనె కలిపి గోరువెచ్చని నీటిలో వేసి,  నొప్పి ఉన్న చోట రాయడం వల్ల రెండు మూడు రోజుల్లోనే నొప్పి తగ్గుతుంది.


స్థూల కాయంతో బాధపడుతున్నవారు రోజూ  పొందాల్సిన చెక్క పొడిని నీటిలో కలుపుకుని తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గడమే కాదు షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి.

మంట ,గొంతులో నొప్పి, జలుబు, గరగర వంటి సమస్యలు ఉన్నప్పుడు దాల్చిన చెక్క పొడిని తేనెతో కలిపి తాగడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఆర్థరైటిస్ సమస్య తో బాధపడుతున్న వారికి  దాల్చిన చెక్క మంచి మెడిసిన్ గా పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: