వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అపురూపమైన ఘట్టం. కల్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని పెద్దలు అంటుంటారు. కానీ ప్రస్తుత సమాజంలో చాలా మంది యువత జీవితంలో త్వరగా స్థిరపడకపోవడంతో ఎలాంటి ఉద్యోగాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ, పెళ్లిళ్లు చేసుకోవడానికి వాయిదా కూడా వేస్తున్నారు. కొంతమందికి త్వరగా వివాహం చేసుకోవాలని అనుకున్న సరైన జోడీ దొరక్క పోవడంతో ఆలస్యం చేస్తూ ఉన్నారు. ఇలా చాలా మంది పెళ్లి చేసుకోవాలని కోరిక ఉన్నా ఇలాంటి కారణాల వల్ల చేసుకోలేకపోతున్నారు అని తెలుస్తోంది. ఇక పెళ్లి చేసుకున్న వారైతే వింత వింత ఆలోచనలతో వివాహం తర్వాత పిల్లల విషయంలో కనీసం మూడు నుంచి నాలుగు సంవత్సరాలు వెయిటింగ్ చేయాలనే కండీషను కూడా పెట్టుకుంటున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు ఇలా ప్రత్యేకమైన కారణాలతో పిల్లల విషయంలో ఆగుతున్నారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో పెళ్లికాని యువకులను, యువతులను ఒక సర్వేలో ప్రశ్నించగా ఇలాంటి ప్రత్యేక సమాధానం ఇచ్చారని తెలుస్తోంది ఈ వినడానికి చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. వివాహమైన తర్వాత పిల్లలు ఎలాగైనా పుడతారని, అది వివాహం అనేది ఒకటి కావాలని పిల్లలు వద్దు అనే చాలా మంది చెబుతున్నారు. ఈ యొక్క యూత్ సర్వేలో 18 నుంచి 34 సంవత్సరాల  యూత్ ను అడిగితే చెప్పిన సమాధానాలు ఇవి. వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన ఘట్టమని 52 శాతం మంది యూత్ అభిప్రాయపడుతున్నారు..

ఇందులో వివాహం చేసుకున్నా చేసుకోకపోయినా ఏం కాదు అని అనుకునేవారు 27% మంది ఉన్నారని తేలింది. ఇంకొంతమంది వివాహం చేసుకోకపోయినా పర్వాలేదు సహజీవనం మాత్రం చేస్తామని  చెప్పినవారు 22 శాతం ఉన్నారని, తేలింది. వివాహం అయిన తర్వాత పిల్లల విషయానికి వచ్చినప్పుడు 54 శాతం మంది పిల్లలు కావాలని కోరుకుంటుంటే, ఇందులో 19 శాతం మంది ఎటూ తేల్చుకోలేక పోతున్నారని, ఐదు శాతం మంది ఎవరినైనా పెంచుకుంటామని, ఇంకో 15 శాతం మంది అసలు పిల్లలే అవసరం లేదని చెప్పారు. ఈ విధంగా యూత్ సర్వే లో ప్రత్యేకమైన కారణాలు బయటపడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: