ప్రస్తుతం భారత్ లో పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ సమయాన్ని అందిపుచ్చుకుంటే ప్రతి ఒక్క పౌరుడి నుండి దేశం వరకు అభివృద్ధి పదంలో ముందుకు అడుగులు వేయవచ్చు. కానీ ఇలాంటివి చేసేందుకు అడుగులు వేయకుండా ఇంకా వాళ్ళ పాత స్వభావాలను అనుసరిస్తూ అందరు ప్రవర్తిస్తున్నారు. వీటిని అదునుగా చేసుకొని కొన్ని రాజకీయ పార్టీలు దేశంలోని పరిస్థితులను కూడా ప్రజలకు అర్ధం కానివ్వకుండా తమవైపు తిప్పుకొని దారి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నాయి. నిజానికి ఇలా చేయడం దేశద్రోహం అవుతుంది, అది ఆ పార్టీలకు తెలిసినా చేస్తూనే ఉంటాయి, ఎందుకంటే వాటి అంతిమ లక్ష్యం దేశాభివృద్ధి కాదు, కేవలం అధికారం. మరి ప్రస్తుత పరిస్థితిని అర్ధం చేసుకోగలిగే స్థితిలో భారత యువత ఉన్నదా అనేది కూడా ప్రశ్న.

ఈ యువతలో ఎక్కువ మంది ఆయా పార్టీల కార్యాలయాలలో పెంపుడు కుక్కపిల్లలుగా(ఎవరినో విమర్శించడానికి కాదు, ఒక్కసారి మీరే సందర్భాన్ని పరికించుకొని చూడండి) తయారయ్యారనేది చూస్తూనే ఉన్నాం. వాళ్లకు ఆయా పార్టీల విషయాలు తప్ప, దేశం గురించి ఆలోచించే కనీస విచక్షణ లోపిస్తుంది. అదే దేశానికి పెద్ద సమస్యగా పరిణమిస్తుంది. దేశంలో అత్యంత ఎక్కువగా యువత ఉన్నారు అన్నప్పుడు వాళ్ళు ఎంత కృషి చేస్తే అంత గొప్పగా దేశం ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భం ఇప్పుడు రెండు రకాలుగా వచ్చేసింది. ఒకటి యువభారతం(52%), రెండు దేశానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు రావడం ద్వారా పెరిగిపోతున్న అంతర్జాతీయ అవకాశాలు. ఇవన్నీ త్వరితగతిన దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడే అద్భుత అవకాశాలు.

కానీ అవన్నీ ఒక్కక్షణం ఆగి ఆలోచించే పరిస్థితి నేటి యువతకు ఉన్నదా అన్నదే ఇక్కడ మరో ప్రశ్న. కనీసం దేశ పరిస్థితిని గురించి ఆలోచించలేకపోతే, అది తామే అధికంగా ఉన్న సమయంలో, అలాగే ఒక అద్భుత అవకాశం ఉన్న సమయంలో ఇలా పార్టీలను పట్టుకు తిరగడం లేదా అలాంటి మరొక దానిలో ఉండిపోవడం ఎంతవరకు సమంజసం. ఈ అవకాశాలను యువత మరియు ప్రభుత్వం ఉమ్మడిగా వాడుకుంటే కేవలం దశాబ్ద కాలంలో కొత్త భారతాన్ని రచించుకోవచ్చు. ఈ తరం అభివృద్ధి చెందిన భారతాన్ని చూసే వెళ్లిపోయే అద్భుత అవకాశం ఇది. రండి ప్రయత్నిద్దాం, దేశాన్ని, మనల్ని కూడా అభివృద్ధి పదం వైపుకు తీసుకుపోదాం!

మరింత సమాచారం తెలుసుకోండి: