సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలి..వ్యాధులు సోకకుండా ఉండాలి అంటే శరీరం లోపల రోగనిరోధకశక్తి పెరగాలి. అప్పుడే మనకు రోగాలు రాకుండా మనం ఆరోగ్యవంతంగా ఉండడానికి వీలుంటుంది. ఇకపోతే ఆయుర్వేద చికిత్సలో భాగంగా ఎన్నో వ్యాధులను నయం చేయడానికి ఎన్నో రకాల కషాయాలను కూడా తయారు చేస్తూ ఉంటారు. దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం నుండే వ్యాధులను నయం చేయడానికి ఆయుర్వేద చికిత్స ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ఆయుర్వేద చికిత్స వల్ల ఫలితం పొందడం విధానమే అయినా శాశ్వతంగా సమస్యను దూరం చేసుకోవచ్చు.

కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది ఒక టాబ్లెట్ వేసుకుంటే చాలు చిటికెలో సమస్య తగ్గి పోవాలని కోరుకుంటున్నారు. ఇలాంటి టాబ్లెట్ వాడడం వల్ల తాత్కాలికంగా ఉపశమనం లభించినా.. దీర్ఘకాలంగా ఆ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సహజ పద్ధతిలో కొన్ని రకాల సమస్యలను నయం చేయడానికి ఒక్క కషాయం తీసుకుంటే సరిపోతుందట. ఆ కషాయం ఏమిటి అంటే..ధనియాల కషాయం.. తయారు చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు.. కేవలం మనకు వంటింట్లో అందుబాటులో ఉండే పదార్థాలతోనే ఈ కషాయాన్ని తయారు చేసుకోవచ్చును.

ధనియాల కషాయంలో కొద్దిగా రాక్ సాల్ట్ ను కలుపుకొని తాగడం వల్ల.. పరగడుపున తాగితే ఎసిడిటీ , బర్నింగ్ సెన్సేషన్, జీర్ణక్రియ సంబంధిత వ్యాధులు వంటివి దూరం అవుతాయి. అంతే కాదు ఫైబర్ అధిక శాతంలో ఉండటం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. ఉదయాన్నే పరగడుపున 50ml ధనియాల కషాయం తాగడం వల్ల జీర్ణ ప్రక్రియకు సంబంధించిన సమస్యలతో పాటు ఇన్ఫెక్షన్, జ్వరం వంటి  సమస్యలు దూరం అవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. టాక్సిన్స్ తొలగిపోతాయి. ముఖం మీద వచ్చే ఆక్నే, స్కార్, పిగ్మెంటేషన్ వంటి సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. అంతే కాదు బరువు తగ్గడానికి కూడా ఈ కషాయం ఎంతగానో సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: